Site icon NTV Telugu

Himanta Biswa Sarma: గాంధీల కన్నా ఎక్కువ అవినీతిపరులు ఉంటారా.? అస్సాం సీఎం ఎదురుదాడి..

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma

Himanta Biswa Sarma: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ సందర్భంగా అస్సాంలో పర్యటిస్తున్న ఆయన, ముఖ్యమంత్రి హిమంత బిశ్వ సర్మ గురించి సంచలన ఆరోపణలు చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి సీఎం అని రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే తాజాగా ఈ వ్యాఖ్యలపై అస్సాం సీఎం ఎదురుదాడి ప్రారంభించారు.

Read Also: Butter Chicken: “బటర్ చికెన్” కోసం ఢిల్లీ హైకోర్టులో న్యాయ పోరాటం..

గాంధీల కన్నా అవినీతిపరులు దేశంలో ఎవరూ ఉండరని ఆయన హిమంత శనివారం విమర్శించారు. ‘‘అయితే నేను ఒక్కటి మాత్రమే అడగాలనుకుంటున్నాను, గాంధీల కంటే అవినీతిపరులు ఎవరైనా ఉండగలరా? – బోఫోర్స్ స్కామ్, నేషనల్ హెరాల్డ్ స్కామ్, భోపాల్ గ్యాస్ ట్రాజెడీ, అండర్సన్ తప్పించుకోవడం, 2G స్కామ్, బొగ్గు కుంభకోణం మొదలైనవి (జాబితా. చాలా పెద్దది మరియు ఇది కొనసాగుతుంది)’’ అంటూ ట్విట్టర్‌లో ఆరోపించారు.

అంతకుముందు.. అవినీతిలో ఎలా మునిగి తేలాలి..? అనే అంశంపై ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హిమంత బిశ్వ సర్మ పాఠాలు చెప్పగలరంటూ రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై వరకు ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ ప్రారంభించారు. ఈ యాత్ర జనవరి 25 వరకు అస్సాం మీదుగా 17 జిల్లాల గుండా మొత్తం 833 కిలోమీటర్లు ప్రయాణించనుంది.

Exit mobile version