RG Kar Case: ఆర్జీకర్ కేసులో ట్విస్ట్.. మళ్లీ దర్యాప్తుకు హైకోర్టు ఆదేశం
- ఆర్జీ కర్ కేసులో కలకత్తా హైకోర్టు కీలక నిర్ణయం..
- మళ్లీ దర్యాప్తు చేయాలని సీబీఐకి ఆదేశం..
- సాక్ష్యాలు నాశనం చేశారనే ఆరోపణల పరిశీలన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RG Kar Case: దేశాన్ని, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2024లో జరిగిన ఈ దారుణ ఘటనపై కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు నాశనం చేశారనే ఆరోపణలు, ఘటన తీవ్రతను తగ్గించి చూపారనే వాదనల నేపథ్యంలో మళ్లీ కొత్త దర్యాప్తుకు హైకోర్టు ఆదేశించింది.
Read Also: Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
Also Read
- Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
- Nana Patekar: షాకింగ్.. నానా పటేకర్ మృతిపై అనుమానాలు? అసహజ మరణం కింద కేసు నమోదు!!
- Jantar mantar: దేశ రాజధాని స్తంభించబోతోందా?
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపణలపై పున:దర్యాప్తు చేసేందుకు సీబీఐతో ముగ్గురు సభ్యుల సిట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. 2024 ఆగస్టు 09 తేదీ రాత్రి ఆర్జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ లోపల ఒక యువ ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ ఘటనపై జస్టిస్ శంపా సర్కార్, జస్టిస్ తీర్థంకర్ ఘోష్‌లో కూడిన ధర్మాసనం, కొత్తగా విచారణ చేసే సిట్‌కు సీబీఐ జాయింట్ డైరెక్టర్(తూర్పు జోన్) నాయకత్వం వహిస్తారని చెప్పింది. మరో ఇద్దరు సభ్యుల్ని 48 గంటల్లో ఖరారు చేయాలని ఆదేశించింది.
రాత్రి మహిళా వైద్యురాలు భోజనం చేసినప్పటి నుంచి ఆమె అంత్యక్రియలు జరిగే వరకు జరిగిన సంఘటలను పరిశీలించాలని సీబీఐని హైకోర్టు ఆదేశించింది. ఈ సంఘటనలో తీవ్రతను తగ్గించడానికి సాక్ష్యాలు నాశనం చేశారని బాధితురాలి తల్లిదండ్రులు చేసిన ఆరోపణల్ని సిట్ పరిశీలిస్తుందని న్యాయస్థానం చెప్పింది. జూన్ 25న ఈ విషయంపై మళ్లీ విచారిస్తామని వెల్లడించింది. ఈలోగా దర్యాప్తు నివేదికను సమర్పించాలని సిట్‌ను కోరింది. ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది. బాధితురాలి తల్లిదండ్రులు మాత్రం ఈ ఘటనలో ఒకరి కన్నా ఎక్కువ మంది ప్రమేయం ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు.
తాజావార్తలు
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
-
Amazon Sale Price History: సేల్‌లో భారీ ఆఫర్లు చూసి మోసపోకండి.. ఒక్క క్లిక్‌తో ధరల చరిత్ర తెలుసుకోండి..!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!