C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొంది. హర్యానాలో ఘన విజయం సాధించిన బీజేపీ, మరోసారి మహారాష్ట్రలో కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి( బీజేపీ-ఎన్సీపీ అజిత్ పవార్- శివసేన ఏక్‌నాథ్ షిండే), మరోవైపు ‘మహా వికాస్ అఘాడీ’( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఉద్ధవ్ ఠాక్రే) కూటమి పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
NDA vs INDIA: 2024 లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందుకు బీజేపీ, కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తమ పూర్తి బలాన్ని పెంచుకుంటున్నాయి. ఇందులో ప్రధాన పోటీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే, ఇండియా కూటమిల మధ్యే ఉంటుంది. అయితే అందరి మదిలో ఓ ప్రశ్న మెదులుతోంది. ఎన్డీయే లేదా ఇండియా కూటమిలో ఎవరు గెలుస్తారు. ఇందుకు సంబంధించి సీ-వోటర్‌తో ఏబీపీ సర్వే నిర్వహించింది. తూర్పు, పశ్చిమ, ఉత్తర భారతంలో బీజేపీ బలమైన స్థానంలో ఉందని…