C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొంది. హర్యానాలో ఘన విజయం సాధించిన బీజేపీ, మరోసారి మహారాష్ట్రలో కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి( బీజేపీ-ఎన్సీపీ అజిత్ పవార్- శివసేన ఏక్‌నాథ్ షిండే), మరోవైపు ‘మహా వికాస్ అఘాడీ’( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఉద్ధవ్ ఠాక్రే) కూటమి పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.
రెండు కూటములు కూడా తమ ముఖ్యమంత్రి అభ్యర్థుల్ని ప్రకటించలేదు. ఎన్నికల గెలుపు తర్వాతే ఓ క్లారిటీ రానుంది. ఇదిలా ఉంటే ‘‘సీఓటర్ సర్వే’’ మహారాష్ట్ర ప్రజలు ఎవరిని సీఎంగా కోరుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించింది. అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ చివరి రోజు ఈ ఫలితాలను వెల్లడించింది. ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ షిండే వైపే మహారాష్ట్ర ఓటర్లు మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. రెండో స్థానంలో ఉద్ధవ్ ఠాక్రే, మూడో స్థానంలో దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు. శరద్ పవార్ 4వ స్థానంలో, అజిత్ పవార్ 5వ స్థానంలో ఉన్నారు.
Read Also: South Central Railway: తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణించిన ప్యాసింజర్‌కి రూ.25 వేల పరిహారం.. కారణం?
ప్రాంతాల వారీగా ప్రజలు ఎవర్ని సీఎంగా కోరుకుంటున్నారు..?
ఏకనాథ్ షిండే
ముంబై – 25.3 శాతం
కొంకణ్ – 36.7 శాతం
మరాఠ్వాడా – 27.4 శాతం
ఉత్తర మహారాష్ట్ర – 33.1 శాతం
విదర్భ – 25.1 శాతం
పశ్చిమ మహారాష్ట్ర – 22.8 శాతం
సగటు – 27.5 శాతం
ఉద్ధవ్ ఠాక్రే
ముంబై – 23.2 శాతం
కొంకణ్ – 26.3 శాతం
మరాఠ్వాడా – 22.3 శాతం
ఉత్తర మహారాష్ట్ర – 23.3 శాతం
విదర్భ – 23.2 శాతం
పశ్చిమ మహారాష్ట్ర – 20.7 శాతం
సగటు – 22.9 శాతం
దేవేంద్ర ఫడ్నవీస్
ముంబై – 14.8 శాతం
కొంకణ్ – 10.4 శాతం
విదర్భ – 13.7 శాతం
సగటు – 10.8 శాతం
అజిత్ పవార్
ముంబై – 0.8 శాతం
కొంకణ్ – 0.9 శాతం
మరాఠ్వాడా – 2.4 శాతం
ఉత్తర మహారాష్ట్ర – 2.5 శాతం
విదర్భ – 2.4 శాతం
పశ్చిమ మహారాష్ట్ర – 6.6 శాతం
సగటు – 3.1 శాతం