C Voter Survey Maharashtra: మహారాష్ట్ర ఎన్నికలపై దేశవ్యాప్తంగా అందరి ఆసక్తి నెలకొంది. హర్యానాలో ఘన విజయం సాధించిన బీజేపీ, మరోసారి మహారాష్ట్రలో కూటమిగా అధికారాన్ని చేజిక్కించుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార ‘మహాయుతి’ కూటమి( బీజేపీ-ఎన్సీపీ అజిత్ పవార్- శివసేన ఏక్‌నాథ్ షిండే), మరోవైపు ‘మహా వికాస్ అఘాడీ’( కాంగ్రెస్-ఎన్సీపీ శరద్ పవార్- శివసేన ఉద్ధవ్ ఠాక్రే) కూటమి పోటీ పడుతున్నాయి. ఈ రెండు కూటముల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.