NTV Telugu Site icon

Wayanad: రేపే వయనాడ్ బైపోల్.. ప్రియాంక-నవ్య హరిదాస్ మధ్య తీవ్రపోటీ

Priyanka

Priyanka

వయనాడ్‌ లోక్‌సభ ఉపఎన్నిక బుధవారం జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. వయనాడ్ సహా 31 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. వయనాడ్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక్కడ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ సోదరీ ప్రియాంకాగాంధీ పోటీ చేస్తున్నారు. తొలిసారి ప్రియాంక ఎన్నికల రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారానికే పరిమితమైన ప్రియాంక ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇక ఇక్కడ బీజేపీ.. నవ్య హరిదాస్‌ అనే మహిళా కీలక నేతను రంగంలోకి దింపింది. ప్రస్తుతం ప్రియాంక వర్సెస్ నవ్య అన్నట్టుగా పోటీ నెలకొంది. మరీ వయనాడ్ ప్రజలు ఎవరికీ పట్టం కడతారో వేచి చూడాలి.

ఇది కూడా చదవండి: Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త బౌలింగ్ కోచ్‌గా మునాఫ్ పటేల్‌..

బుధవారం జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు వయనాడ్‌ లోక్‌సభ స్థానం, 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నవంబర్ 13న ఓటింగ్ జరగనుంది. వాస్తవానికి నవంబర్ 13 ఓటింగ్ జరగాల్సిన సిక్కింలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. దీంతో ఆ రెండు నియోజకవర్గాల్లో బుధవారం పోలింగ్ లేదు. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Zebra Trailer: మెగాస్టార్ చేతుల మీదుగా సత్యదేవ్ ‘జీబ్రా’ ట్రైలర్ విడుదల

వయనాడ్‌లో ప్రియాంక పోటీ చేయడంతో దేశ వ్యాప్తంగా ఫోకస్ పడింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీ రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయంతో గెలుపొందారు. అయితే రాయ్‌బరేలీ స్థానాన్ని ఉంచుకుని.. వయనాడ్‌ను వదులుకున్నారు. దీంతో ఉపఎన్నిక అనివార్యమైంది.

31 అసెంబ్లీ స్థానాలు ఇవే..
అస్సాం: ధోలై, సిడ్లీ, బొంగైగావ్, బెహాలి, సమగురి
బీహార్: తరారీ, రామ్‌గఢ్, ఇమామ్‌గంజ్, బెలగంజ్
ఛత్తీస్‌గఢ్: దక్షిణ రాయ్‌పూర్ నగరం
గుజరాత్: వావ్
కర్ణాటక: షిగ్గావ్, సండూర్, చన్నపట్న
కేరళ: చెలక్కర
మధ్యప్రదేశ్: బుధ్ని, విజయ్‌పూర్
మేఘాలయ: గ్రామ్‌బేఘాలయ
రాజస్తాన్: జుంఝును, రామ్‌ఘర్, దౌసా, డియోలీ-ఉనియారా, ఖిన్వ్సర్, సాలంబెర్, చోరాసి
పశ్చిమ బెంగాల్: సితాయ్, మదారిహత్, నైహతి, హరోవా, మేదినీపూర్, తల్దంగ్రా