ఆపరేషన్ సిందూర్, అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని ప్రముఖ వ్యాపార వేత్త గౌతమ్ అదానీ గుర్తుచేసుకున్నారు. అదానీ ఎంటర్‌ప్రైజెస్ వార్షిక సర్వసభ్య సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్‌కు శాంతి విలువ ఏంటో తెలుసు అని పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సాయుధ దళాలకు అదానీ సెల్యూట్ చేశారు. అలాగే అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదాన్ని కూడా గుర్తు చేసుకున్నారు. ఇక అమెరికా లంచం ఆరోపణలను ఆయన ఖండించారు.
ఇది కూడా చదవండి: Chicken : చికెన్ స్కిన్ తింటే ప్రమాదమే.. ఈ ఆరోగ్య సమస్యలున్నవారు జాగ్రత్త!
ఇక ఆపరేషన్ సిందూర్‌లో అదానీ డిఫెన్స్ డ్రోన్లు కూడా భాగమయ్యాయని తెలిపారు. విజయం సాధించినట్లు చెప్పుకొచ్చారు. యాంటీ డ్రోన్ వ్యవస్థలు మన దళాలను, పౌరులను రక్షించడంలో సహాయపడ్డాయని చెప్పారు. భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో మన బలగాలు అత్యంత ధైర్యసాహసాలు కనబరిచాయని కొనియాడారు. పేరు, ప్రతిష్టలు, పతకాల కోసం కాకుండా విధి నిర్వహణలో భాగంగా పనిచేశారని ప్రశంసించారు. శాంతి విలువ ఏంటో భారత్‌కు బాగా తెలుసు అని.. అలా అని ఎవరైనా మనకు హాని కలిగించాలని చూస్తే.. వారి భాషలో ఎలా స్పందించాలో కూడా బాగా తెలుసు అని అదానీ పేర్కొన్నారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో మరణించిన వారికి సంతాపం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పోటీ చేసే దమ్ముందా?.. పవన్ కల్యాణ్‌కు మంత్రి సవాల్!
ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రవాదులు చెలరేగిపోయారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. స్త్రీలను, పిల్లలను వదిలిపెట్టి భర్తలను చంపేశారు. పదుల కొద్ది గాయపడ్డారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం.. పాకిస్థాన్‌పై కఠిన నిర్ణయాలు తీసుకుంది. ఇక మే 7న పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. మొత్తానికి పాకిస్థాన్ కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
