కేంద్ర బడ్జెట్ సందర్భంగా సంప్రదాయబద్ధంగా నిర్వహించే హల్వా వేడుక ఢిల్లీలో జరిగింది. ఢిల్లీలోని నార్త్ బ్లాక్‌లో మంగళవారం నిర్వహించారు. కేంద్ర బడ్జెట్-2024-25 ప్రక్రియ చివరి దశకు రావడంతో జరిగిన ఈ హల్వా తయారీ వేడుకలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వయంగా నిర్మలమ్మ.. ఆర్థిక శాఖ కార్యదర్శులు, అధికారులు, సిబ్బందికి హల్వా పంచారు. ఈ కార్యక్రమలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, సీనియర్ సెక్రటరీలు పాల్గొన్నారు..
ఇది కూడా చదవండి: Amaravati: రాజధానిని నేషనల్ హైవేతో అనుసంధానించేలా సీఆర్డీయే ప్రణాళికలు
హల్వా ఆచారం దశాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు. ముఖ్యమైన లేదా ప్రత్యేకమైనదాన్ని ప్రారంభించే ముందు ఏదైనా తీపిని తినడం భారతీయ సంప్రదాయం. దాని నుంచే ఈ హల్వా ప్రేరణ పొందింది. బడ్జెట్‌ను తయారు చేయడంలో పాల్గొన్న వారందరి ప్రయత్నాలను గుర్తించేందుకు ఇది ఒక గుర్తుగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: Gurugram: ఆస్పత్రిలో దారుణం.. విదేశీ మహిళా రోగిపై అఘాయిత్యం
ఇక బడ్జెట్ డాక్యుమెంట్ల ప్రింటింగ్ 1980 నుంచి నార్త్ బ్లాక్ బేస్‌మెంట్‌లో తయారవుతోంది. బడ్జెట్ వివరాలు బయటకు రాకుండా అందరూ అక్కడే కొద్ది రోజుల పాటు ఉండేలా చేస్తారు. మొబైల్స్ ఫోన్స్‌కు కూడా అనుమతి ఉండదు. ఇక పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జూలై 22 నుంచి ఆగస్టు 12 వరకూ జరగనుండగా, జూలై 23న పూర్తి బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెడతారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న ఆరవ బడ్జెట్ ఇది.
#WATCH | Delhi: The Halwa ceremony, marking the final stage of the Budget preparation process for Union Budget 2024, was held in North Block, today, in the presence of Union Finance & Corporate Affairs Minister Nirmala Sitharaman.
A customary Halwa ceremony is performed… pic.twitter.com/mVScsFHun9
— ANI (@ANI) July 16, 2024
The final stage of the Budget preparation process for Union Budget 2024-25 commenced with the customary Halwa ceremony in the presence of Union Minister for Finance and Corporate Affairs Smt. @nsitharaman, in New Delhi, today. (1/4) pic.twitter.com/X1ywbQx70A
— Ministry of Finance (@FinMinIndia) July 16, 2024