వన్ నేషన్-వన్ ఎలక్షన్‌కు బీఎస్పీ అధినేత మాయావతి జై కొట్టారు. మోడీ 3.0 సర్కార్ హయాంలోనే జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. జమిలి ఎన్నికలు నిర్వహించి తీరుతామని ప్రకటించారు. ఇక బుధవారం కేంద్ర కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది. శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్ ఉభయసభల్లో బిల్లు తీసుకురానున్నారు.
ఇది కూడా చదవండి: Jani Master :జానీ మాస్టర్ పై మహిళా కమిషన్ కి ఫిర్యాదు
ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలను కాంగ్రెస్, వామపక్షాలు, పలు పార్టీలు వ్యతిరేకిస్తుంటే.. బీఎస్పీ అధినేత మాయావతి మాత్రం సానుకూలంగా స్పందించారు. ఒకే దేశం-ఒకే ఎన్నికలకు బీఎస్పీ సానుకూలం అని ఆమె ప్రకటించారు. జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది. ఈ కమిటీ ఆయా పార్టీలు, ప్రజలను అభిప్రాయాలు సేకరించి.. నివేదికను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది. తాజాగా బుధవారం మోడీ నేతృత్వంలో కేబినెట్ కూడా ఆమోదముద్ర వేసింది.
ఇది కూడా చదవండి: Dengue: డెంగ్యూ వచ్చిందా?.. ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి!
ఇదిలా ఉంటే జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ఇటీవలే కాంగ్రెస్, వామపక్షాలు స్పష్టం చేశాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే కనీసం 5 రాజ్యాంగ సవరణలు చేయాల్సి ఉంటుందని.. అందుకు లోక్‌సభలోనూ.. రాజ్యసభలోనూ మోడీ ప్రభుత్వానికి బలం లేదని స్పష్టంచేశాయి.
జమిలి అంటే ఏంటి?
లోక్‌సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను కూడా ఒకేసారి నిర్వహించడాన్ని జమిలి అంటారు. వాస్తవానికి పార్లమెంట్ ఎన్నికల సమయానికి ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాలకే ఎన్నికలు జరుగుతున్నాయి. మిగతా రాష్ట్రాలకు ఆయా సమయాల్లో జరుగుతున్నాయి. ఈసారి మాత్రం కొన్ని నెలలు గ్యాప్ ఉన్న రాష్ట్రాలను కూడా లోక్‌సభ ఎన్నికల దాకా పొడిగించవచ్చు. అందులో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ అసెంబ్లీల గడువును పొడిగించి లోక్‌సభ ఎన్నికలతో పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్రాలకు ఆపధర్మ ప్రభుత్వాన్ని నడపడానికి రాజ్యాంగంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే.. ఈ రాష్ట్రాల్లో కూడా లోక్‌సభతో పాటు నిర్వహించే ఛాన్సుంటుంది.