Boris Johnson: భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని.. రెండు రోజుల పాటు పర్యటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ రెండు రోజుల పర్యటన కోసం భారత్ చేరుకున్నారు. ఈ మేరకు గుజరాత్‌లోని అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా బోరిస్ జాన్సన్‌కు గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, అధికారులు సాదర స్వాగతం పలికారు. అనంతరం పారిశ్రామిక, వ్యాపారవేత్తలతో బోరిస్ సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా భారత్- బ్రిటన్ మధ్య వాణిజ్య, ప్రజా సంబంధాలపై ప్రధానంగా చర్చించనున్నారు. పరిశ్రమల్లో పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై, వైద్య, శాస్త్ర రంగాల్లో కలిసి పనిచేయడంపై ప్రకటన చేయనున్నారు.
ఈ సమావేశం ముగిసిన తర్వాత బోరిస్ జాన్సన్ ఢిల్లీ వెళ్లనున్నారు. శుక్రవారం ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక, సైనిక, వాణిజ్య సంబంధాల గురించి ఇరు దేశాల నేతలు చర్చించనున్నారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌పై కూడా వీరు చర్చించే అవకాశం ఉంది. కాగా బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. బ్రిటన్‌లో ఉన్న భారతీయుల్లో అత్యధికులు గుజరాత్‌కు చెందినవారే కావడంతో ఆయన నేరుగా అహ్మద్‌బాద్ వచ్చారు. గతంలో కరోనా కారణంగా బోరిస్ జాన్సన్ రెండుసార్లు భారత పర్యటనను రద్దు చేసుకున్నారు. గత జనవరిలో గణతంత్ర వేడుకలకు భారత్ ఆహ్వానించగా.. యూకేలో కరోనా విజృంభణ నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడింది. అనంతరం గత ఏడాది ఏప్రిల్‌లో పర్యటన ఖరారు కాగా.. భారత్‌లో కరోనా కేసులు పెరిగిన నేపథ్యంలో మరోసారి ఆయన టూర్ రద్దయ్యింది.
Also Read
తాజావార్తలు
-
RBI New FD Rules: బల్క్ డిపాజిట్ల నుంచి FD వడ్డీ వరకు.. అక్టోబర్ 1 నుంచి RBI కొత్త నిబంధనలు
-
YCP Protest: డీఎస్సీ స్పోర్ట్స్ కోటా వివాదం.. నేడు వైసీపీ నిరసన.. పోటీగా టీచర్ల ర్యాలీ?
-
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. పలు జిల్లాలో అత్యంత భారీ వర్షాలు!
-
The Paradise: టైటిల్లోనే కాదు.. ‘పుష్ప’, ‘పెద్ది’, ‘ప్యారడైజ్’ కథల్లోనూ ఒకే కనెక్షన్.. సెంటిమెంట్ వర్కౌట్ అయ్యేనా ?
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!
-
iPhone 18 Pro Max: ఐఫోన్ 18 ప్రో మాక్స్ ఛార్జింగ్ టెస్ట్‌లో సంచలనం..
-
Jio యూజర్లకు అదిరిపోయే ఆఫర్.. ఏడాది పాటు Amazon Prime Lite ఫ్రీ.. ఎలా పొందాలంటే.?
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!