Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…

  • మేకప్ సామాగ్రి తక్కువైందంటూ పెళ్లి క్యాన్సిల్..
  • వధువు నిర్ణయంతో అంతా షాక్, దాడి చేసుకున్న ఇరు వర్గాలు..
Wedding News

Wedding News

Shocking: ఇటీవల కాలంలో చిన్న చిన్న వివాదాలు పీటల మీద వరకు వచ్చిన పెళ్లిళ్లను పెటాకులు చేస్తున్నాయి. వధువు, వరుడి కుటుంబాలు పంతానికి పోవడంతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ పెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం పెళ్లికూతరుకు ‘‘మేకప్ సామాగ్రి’’ తక్కువ కావడమే. తమను మేకప్ వస్తువులు తక్కువగా ఉన్నాయంటూ వధువు పెళ్లికి నిరాకరించింది. ఈ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారి ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడికి దారి తీసింది.

Read Also: Quantum Technology: చరిత్ర సృష్టించిన భారత్.. “క్వాంటం కమ్యూనికేషన్ టెక్నాలజీ” సక్సెస్

బిజ్నోర్‌లోని నూర్‌పూర్‌లోని మొహల్లా ఇస్లాం నగర్‌కు చెందిన ఒక యువకుడికి , నహతౌర్‌లోని జస్మౌరా గ్రామానికి చెందిన ఒక మహిళతో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 8వ తేదీ, బుధవారం రాత్రి నహతౌర్-ధాంపూర్ రోడ్డుపై పెళ్లి ఊరేగింపు మంటపానికి చేరుకుంది. అయితే, అదే సమయం తనకు మేకప్ సామాగ్రి తగినంత లేదని పెళ్లికూతురు వివాహాన్ని నిరాకరించింది. దీంతో ఒక్కసారిగా వధువు, వరుడి కుటుంబాలు ఒకరిని ఒకరు దూషించుకోవడం ప్రారంభించారు. ఇది కాస్త భౌతిక దాడిగా మారింది. దీనికి సంబంధించినన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లికొడుకు కారును ధ్వంసం చేశారు. పెళ్లికొడుకు అన్నను తీవ్రంగా కొట్టారు.

గొడవ తీవ్రం కావడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చివరు పెద్దమనుషుల పంచాయతీ తర్వాత వివాహం రద్దు చేసుకున్నట్లు ఇరు కుటుంబాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. పెళ్లికి అయిన ఖర్చుల్ని వరుడి కుటుంబం చెల్లించేందుకు ఒప్పుకుంది.