Shocking: మేకప్ సామాగ్రి తక్కువైందని పెళ్లి క్యాన్సిల్…
- మేకప్ సామాగ్రి తక్కువైందంటూ పెళ్లి క్యాన్సిల్..
- వధువు నిర్ణయంతో అంతా షాక్, దాడి చేసుకున్న ఇరు వర్గాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shocking: ఇటీవల కాలంలో చిన్న చిన్న వివాదాలు పీటల మీద వరకు వచ్చిన పెళ్లిళ్లను పెటాకులు చేస్తున్నాయి. వధువు, వరుడి కుటుంబాలు పంతానికి పోవడంతో పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్‌లో ఓ పెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం పెళ్లికూతరుకు ‘‘మేకప్ సామాగ్రి’’ తక్కువ కావడమే. తమను మేకప్ వస్తువులు తక్కువగా ఉన్నాయంటూ వధువు పెళ్లికి నిరాకరించింది. ఈ వివాదం చిలికిచిలికి గాలి వానలా మారి ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడికి దారి తీసింది.
Read Also: Quantum Technology: చరిత్ర సృష్టించిన భారత్.. “క్వాంటం కమ్యూనికేషన్ టెక్నాలజీ” సక్సెస్
Also Read
- SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
- Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
- CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
- Sheetalnath Temple: కాశ్మీర్లో 36 ఏళ్ల తర్వాత తెరుచుకున్న శీతల్నాథ్ ఆలయం..
బిజ్నోర్‌లోని నూర్‌పూర్‌లోని మొహల్లా ఇస్లాం నగర్‌కు చెందిన ఒక యువకుడికి , నహతౌర్‌లోని జస్మౌరా గ్రామానికి చెందిన ఒక మహిళతో నిశ్చితార్థం జరిగింది. ఏప్రిల్ 8వ తేదీ, బుధవారం రాత్రి నహతౌర్-ధాంపూర్ రోడ్డుపై పెళ్లి ఊరేగింపు మంటపానికి చేరుకుంది. అయితే, అదే సమయం తనకు మేకప్ సామాగ్రి తగినంత లేదని పెళ్లికూతురు వివాహాన్ని నిరాకరించింది. దీంతో ఒక్కసారిగా వధువు, వరుడి కుటుంబాలు ఒకరిని ఒకరు దూషించుకోవడం ప్రారంభించారు. ఇది కాస్త భౌతిక దాడిగా మారింది. దీనికి సంబంధించినన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెళ్లికొడుకు కారును ధ్వంసం చేశారు. పెళ్లికొడుకు అన్నను తీవ్రంగా కొట్టారు.
గొడవ తీవ్రం కావడంతో పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. చివరు పెద్దమనుషుల పంచాయతీ తర్వాత వివాహం రద్దు చేసుకున్నట్లు ఇరు కుటుంబాలు ఒక ఒప్పందానికి వచ్చాయి. పెళ్లికి అయిన ఖర్చుల్ని వరుడి కుటుంబం చెల్లించేందుకు ఒప్పుకుంది.
తాజావార్తలు
-
SIR row: CEC జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం.!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Trump-Jinping: జిన్‌పింగ్‌కు ట్రంప్ దంపతులు స్వాగతం పలకడం వెనుక ఇంత మతలబు ఉందా?
-
Fuel Prices: రోజుకు రూ. 530 కోట్ల నష్టాల్లో ఆయిల్ కంపెనీలు.. పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!