BRICS Summit 2026: పుతిన్-మోడీ-జిన్‌పింగ్.. ప్రపంచం చూపంతా ఢిల్లీ వైపే!
- సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం
- భారత్ ఆతిథ్యమిస్తున్న సదస్సుకు పుతిన్, జిన్‌పింగ్ హాజరు
- ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కూడా పాల్గొననున్నట్లు సమాచారం
- మోదీ-పుతిన్, మోదీ-జిన్‌పింగ్ భేటీలపై ప్రపంచ దేశాల దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BRICS Summit 2026: భారత్ మరోసారి అంతర్జాతీయ కార్యక్రమానికి వేదికగా మారుతోంది. న్యూఢిల్లీ వేదికగా సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ సమావేశారు జరగనున్నాయి. భారత్ 2012లో తొలిసారి బ్రిక్స్ సదస్సును నిర్వహించింది. 2016, 2021లో కూడా సమావేశాలకు భారత్ వేదికగా మారింది. 2026లో మరోసారి న్యూఢిల్లీలో సమావేశాలు జరుగబోతున్నాయి. ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సహా బ్రిక్స్ సభ్య దేశాధినేతలు, అనేక మంది దౌత్యవేత్తలు, అధికారులు హాజరుకాబోతున్నారు. దీంతో ఈ సమావేశాలపై ప్రపంచం దృష్టి నెలకొంది.
ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ కూడా ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇరాన్-అమెరికా యుద్ధం కూడా సమావేశాల్లో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో మూడు ప్రధాన శక్తులైన రష్యా, చైనా, భారత్ ఈ సమావేశాల్లో కీలకం కాబోతున్నాయి. దీంతో సహజంగానే ప్రపంచం, ముఖ్యంగా అమెరికా, వెస్ట్రన్ కంట్రీస్ ఈ సమావేశాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాయి.
Also Read
- Flydubai: రక్తమోడుతున్నా పట్టువదల్లేదు.. 180 మందిని కాపాడిన భారతీయ పైలట్ ఈయనే.!
- Modi-Trump: మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ట్రేడ్, డిఫెన్స్, ఎనర్జీపై కీలక చర్చలు!
- Central Cabinet: కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్.. గ్రీన్ ఎనర్జీ కారిడార్-3కు ఆమోదం..
- Flydubai: హైజాక్ అలర్ట్‌తో ఇజ్రాయెల్‌లో కలకలం.. ‘‘శత్రువును వదలం’’ అంటూ మంత్రి హెచ్చరిక!
మోడీ-పుతిన్, మోడీ-జిన్‌పింగ్ సమావేశాలపై ఆసక్తి..
బ్రిక్స్ సదస్సు సందర్భంగా మోడీ, పుతిన్ మధ్య ద్వైపాక్షిక సమావేశాలు జరగనున్నాయి. అదే సమయంలో గల్వాన్ ఘర్షణల తర్వాత, 7 ఏళ్ల తర్వాత జిన్‌పింగ్ భారత్ పర్యటనకు వస్తుండటం కూడా ఆసక్తికరంగా మారింది. ఈ రెండు దేశాలతో భారత్ సంబంధాలు మరింత బలపడనున్నాయి. ఇప్పుడిప్పుడే భారత్-చైనాల మధ్య సరిహద్దు చర్చలు కొలిక్కివస్తున్నాయి. ఇక రానున్న రోజుల్లో రెండు దేశాలు తమ సంబంధాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉంది. గతంలో పలు సందర్భాల్లో ‘‘డ్రాగన్-ఎలిఫెంట్ డ్యాన్స్’’ చేయాలంటూ జిన్‌పింగ్ భారత్‌కు స్నేహహస్తాన్ని అందించారు.
రష్యాతో భారత్‌కు దశాబ్ధాలుగా స్నేహ సంబంధాలు ఉన్నాయి. పుతిన్-మోడీ హయాంలో ఈ సంబంధాలు మరింత ఉన్నత స్థాయికి చేరాయి. ఉక్రెయిన్ యుద్ధం రెండు దేశాల సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటున్న అతిపెద్ద దేశంగా భారత్ ఉంది. ఇక రష్యా, భారత్ మధ్య పలు రక్షణ ఒప్పందాలు, టెక్నాలజీకి సంబంధించిన ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ బ్రిక్స్:
ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలు బ్రిక్స్ సమావేశాలకు హాజరవుతున్నాయి. పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం, సౌదీపై హౌతీల దాడులు జరుగుతున్న ఈ సమయంలో బ్రిక్స్ సమావేశాలు కీలకంగా మారాయి. మరోవైపు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో శాంతి ప్రయత్నాలకు భారత్ ఇప్పటికే మద్దతు ఇచ్చింది. ఇటీవల SCO శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ యుద్ధానికి ముగింపు పలికి శాంతి దిశగా ప్రపంచం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో బ్రిక్స్ వేదిక నుంచి కూడా ప్రపంచానికి శాంతి, సహకారం, బహుళ ధ్రువ ప్రపంచ వ్యవస్థకు సంబంధించిన సందేశం వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
LPG Cylinder Price Hike: పండుగ సీజన్‌కు ముందు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ఎల్పీజీ సిలిండర్ల ధరలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!