Waqf bill: వక్ఫ్ బిల్లు ప్యానెల్ సమావేశంలో వాగ్వాదం.. మహిళలకు చోటుపై ప్రతిపక్షాల అభ్యంతరం..
- వక్ఫ్ బిల్లు ప్యానెల్ సమావేశంలో వివాదం..
- బీజేపీ ఎంపీలు.. ప్రతిపక్ష ఎంపీల మధ్య వాగ్వాదం..
- బోర్డులో మహిళలకు చోటు కల్పించడంపై ప్రతిపక్షాల అభ్యంతరం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Waqf bill: వక్ఫ్ (సవరణ) బిల్లుని పరిశీలించేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే, మంగళవారం జేపీసీ సమావేశంలో బీజేపీ ఎంపీలు, ప్రతిపక్షల ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. బీజేపీ ఎంపీలు తమపై అభ్యంతరకరమైన పదజాలాన్ని ఉపయోగించినట్లు ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో వరసగా రెండో రోజు కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వాకౌట్ చేశాయి.
వక్ఫ్ బోర్డుల్లో మహిళలను చేర్చే ప్రతిపాదనపై బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబే, దిలీప్ సైకియా, అభిజిత్ గంగూలీ, తృణమూల్ ఎంపీ కల్యాణ్ బెనర్జీ, కాంగ్రెస్‌కు చెందిన గౌరవ్ గొగోయ్‌ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కమిటీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ నిబంధనల ప్రకారం పనిచేయడం లేదని, బీజేపీ ఎంపీలపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. మరోవైపు ప్రతిపక్ష ఎంపీలు చైర్‌పర్సన్‌ని దుర్భాషలాడుతున్నారని బీజేపీ ఎంపీలు ఆరోపించారు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Read Also: India-Canada Ties: ఖలిస్తానీ సిక్కుల మద్దతు కోసమే ట్రూడో ప్లాన్.. అందుకే భారత్‌తో దౌత్యయుద్ధం..
వక్ఫ్ భూముల కుంభకోణాల్లో కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ప్రమేయం ఉందని కర్ణాటక రాష్ట్ర మైనారిటీ కమిషన్ మాజీ చైర్పర్సన్ అన్వర్ మణిప్పాడి ఆరోపించడంతో ప్రతిపక్షాలు సోమవారం వాకౌట్ చేశాయి. ఇదిలా ఉంటే, ప్రతిపక్ష ఎంపీలు ఈ ప్యానెల్ సమావేశాల్లో ఉన్నతమైన వ్యక్తులపై నిరూపించబడని ఆరోపణలు చేయరాదని పేర్కొన్నారు.
బీజేపీ ఎంపీ నిషికాంద్ దూబే జేపీసీ చైర్పర్సన్ జగదాంబికా పాల్కి లేఖ శారు. దీంట్లో వక్ఫ్ బిల్లుపై వచ్చిన భారీ 1.25 కోట్ల సబ్మిషన్లపై తీవ్రమైన ఆందోళన లేవనెత్తారు.కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ద్వారా దర్యాప్తు చేయాలని కోరారు. ఛాందసవాద గ్రూపులు, జకీర్ నాయక్ వంటి వ్యక్తులు లేదా ‘‘విదేశీ శక్తుల’’ ప్రమేయం ఉందొచ్చని దూబే ఆరోపించారు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!