Site icon NTV Telugu

BR Ambedkar: “అంబేద్కర్ టైపిస్ట్, ప్రూఫ్ రీడర్”.. వీహెచ్‌పీ మాజీ నేత అరెస్ట్..

Vhp Leader

Vhp Leader

BR Ambedkar: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆర్‌బీవీఎస్‌ మణియన్‌ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మణియన్ గతంలో తమిళనాడు వీహెచ్‌పీ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

Read Also: Jammu Kashmir Encounter: మళ్లీ ఫోన్ చేస్తానన్నాడు, అంతలోనే.. కన్నీళ్లు పెట్టిస్తున్న ఆర్మీ అధికారుల వీరమరణం..

భారత రాజ్యాంగ పితామహుడు, “గుమాస్తా, టైపిస్ట్, ఫ్రూఫ్ రీడర్” అయిన బీఆర్ అంబేద్కర్ అని ప్రస్తావించడం వివాదాస్సదమయ్యాయి. మణియన్ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మణియన్ మాట్లాడుతూ..‘‘అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని ఇచ్చారని చాలా మంది చెబుతూనే ఉన్నారు. వారు ఆయన్ను పొగుడుతుంటారు, అతను సొంతగా రాజ్యాంగాన్ని రూపొందిచలేదు, రాజ్యాంగాన్ని రూపొందించేటప్పుడు చలా చర్చలు జరుగుతాయి. వీటన్నింటిని ఒక స్టెనో గ్రాఫర్ టైప్ చేస్తాడు. రాసింది సరైందో లేదో అని చూసే బాధ్యత అంబేద్కర్‌ది’’ అని మణియన్ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు వైరల్ కావడంతో చెన్నై పోలీసలు మణియన్ పై క్షన్ 153 (గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం), 505 (హింసను ప్రేరేపించడం)తో పాటు ఐపీసీలోని సెక్షన్ 3, ఎస్సీ-ఎస్టీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటికే తమిళనాడులో సనాతన ధర్మంపై వివాదం నడుతోస్తోంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని చెబుతూ.. డెంగ్యూ, మలేరియాలతో పోల్చడం తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఆయన వ్యాఖ్యలూపై పలు హిందూ సంఘాలతో పాటు బీజేపీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Exit mobile version