BR Ambedkar: రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్‌పై విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మాజీ నేత అనుచిత వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం గురించి మాట్లాడుతూ.. బీఆర్ అంబేద్కర్ గురించి కించపరిచే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆర్‌బీవీఎస్ మణియన్ ను చెన్నై పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మణియన్ గతంలో తమిళనాడు వీహెచ్‌పీ విభాగానికి ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.