NTV Telugu Site icon

Karnataka: గుడి వద్ద హిందువులే వ్యాపారాలు చేయాలి..వీహెచ్‌పీ వార్నింగ్

Karnataka Temple Issue

Karnataka Temple Issue

Boycott on Muslim traders in Karnataka temple fair: కర్ణాటకలో మరో వివాదం రాజుకుంది. దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలోని శ్రీ మహాలింగేశ్వర ఆలయ ప్రాంగణంలో హిందువులు మాత్రమే వ్యాపారం చేయాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) మరో వర్గం వారికి వార్నింగ్ ఇస్తోంది. దీనికి సంబంధించి ఆలయ పరిసరాల్లో ఓ పోస్టర్ కూడా ఏర్పాటు చేసింది. హిందూ మతం, సంప్రదాయాలపై విశ్వాసం ఉన్న హిందూ వ్యాపారులు మాత్రమే వాణిజ్యం నిర్వహించడానికి అవకాశం ఉంటుందని బ్యానర్ లో పేర్కొన్నారు.

Read Also: Women Health: అమ్మాయిలూ.. మితిమీరిన శృంగారం చేస్తే, అంతే సంగతులు!

దక్షిణ కన్నడ జిల్లా జిల్లాకు చెందిన వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ నాయకులు శనివారం మంగళూర్ నగర సమీపంలోని కావూరు లో జరిగిన మతపరమైన ఉత్సవంలో ముస్లిం వ్యాపారులకు వ్యతిరేకంగా బ్యానర్ ఏర్పాటు చేసింది. జనవరి 14 నుంచి 18 వరకు మహాలింగేశ్వర ఆలయంలో ఉత్సవాలు జరగుతున్నాయి. ఇంతకు ముందు ఎక్కువగా ముస్లిం స్టాల్స్ మాత్రమే ఉండేవని.. ఈ సారి స్టాల్స్ కాంట్రాక్టుల కేటాయింపులను భజరంగ్ దళ్ కార్యకర్తలకు కేటాయించారు.

ఆలయ నిర్వహణ కమిటీ సమావేశంలో ముస్లిం వ్యాపారులను బహిష్కరించే నిర్ణయం తీసుకున్నట్లు భజరంగ్ దళ్ కార్యకర్తలు తెలిపారు. హిందూ మతం విశ్వాసాలు, సంప్రదాయాలపై నమ్మకం ఉన్న హిందూ వ్యాపారులకు మాత్రమే వాణిజ్యం నిర్వహించడాని అవకాశం ఉంటుందని బ్యానర్ ఏర్పాటు చేశారు. విగ్రహాలను పూజించడం హరామ్ అని నమ్మే వారికి అవకాశం ఉండదని ఆలయంలో ఏర్పాటు చేశారు. ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

Show comments