Bombay High Court: పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ ‘‘ఆపరేషన్ సిందూర్’’తో పాకిస్తాన్‌కు సమాధానం ఇచ్చింది. పీఓకే, పాకిస్తాన్ లోపల ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి వందలాది మంది ఉగ్రవాదుల్ని హతమార్చింది. అయితే, మన దేశంలో కొంత మంది మాత్రం దీనిని సమర్థించకుండా, ‘‘ఆపరేషన్ సిందూర్’’కు వ్యతిరేక పోస్టులు పెడుతూ, పాకిస్తాన్ ప్రేమను చూపించారు. ఇలాంటి కేసును విచారిస్తున్న బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Read Also: Bihar: ఎన్నికల ముందు లాలూ కుటుంబంలో వివాదాలు.. కుమార్తె వరస పోస్టులతో కలవరం..
ఆపరేషన్ సిందూర్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు 19 ఏళ్ల విద్యార్థినిపై కేసు పెట్టారు. ఆ పోస్టుపై తీవ్ర విమర్శలు రావడంతో, పోస్టును డిలీట్ చేసింది, క్షమాపణలు చెప్పింది.అయితే, దానికి క్షమాపణలు చెప్పినందున మాత్రమే రద్దు చేయలేమని బాంబే హైకోర్టు మౌఖికంగా వ్యాఖ్యానించింది. నిందితురాలు మెరిట్ స్టూడెంట్, ఆమె పరీక్షల్లో మంచి మార్కుల సాధిస్తే ఎఫ్ఐఆర్ రద్దు చేయలేమని ప్రధాన న్యాయమూర్తి శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ గౌతమ్ అంఖద్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఆపరేషన్ సిందూర్ మధ్య ఇండో-పాక్ ఘర్షణలపై ఆమె సోషల్ మీడియా పోస్ట్ చేసినందుకు ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆమె ఎఫ్ఐఆర్ రద్దు చేయాలని న్యాయవాది కోరిన సమయంలో హైకోర్టు ఈ వ్యాఖ్యల్ని చేసింది. ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత, హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల జరిగిన పరీక్షల్లో మంచి మార్కులు సాధించినట్లు కోర్టు దృష్టికి ఆమె తరుపు న్యాయవాది తీసుకుచ్చారు. ఆమె తెలివైన విద్యార్థిని అనే కారణం ఎఫ్ఐఆర్ రద్దు చేయడానికి కారణం కాదని చెప్పింది. మే 7న సదరు అమ్మాయి ‘‘రిఫార్మిస్తాన్’’ అనే అకౌంట్ నునంచి ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ పెట్టింది. ‘‘భారత ప్రభుత్వం పాకిస్తాన్‌పై యుద్ధాన్ని రెచ్చగొడుతోంది’’ అని ఆమె విమర్శించింది.
