Bombay High Court: ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ, అక్రమంగా నిర్భంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిపై బెయిలబుల్ అభియోగాలు మోపినప్పటికీ పోలీసులు సదరు వ్యక్తి విడుదల చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్భంధంలో ఉంచినందుకు వ్యక్తికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సంగీత ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్భంధించిన కేసులో పోలీసుల వైఖరిని ప్రశ్నించింది.
తన భర్త నితిన్ సంపత్ ని పోలీసులు అక్రమంగా నిర్భంధించారని, బెయిల్ ఇచ్చే ఆరోపణలు అయినప్పటికీ అరెస్ట్ చేశారని ఆయన భార్య నీలం సంపత్ దాఖలు చేసిన పిటిషన్‌ని న్యాయమూర్తులు రేవతి మోహితే దేరే, గౌరీ గాడ్సేలతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. ఈ కేసులో రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (గౌరవంగా జీవించే హక్కు) ప్రకారం నితిన్‌కి హామీ ఇవ్వబడిని హక్కుల్ని పోలీసులు ధిక్కరించారని, అరెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులను స్పష్టంగా ఉల్లంఘించినట్లు పేర్కొంది. పోలీసులు చర్య వల్ల ఒక వ్యక్తికి అన్యాయం జరిగిందని, శారీరక, మానసిక వేదనకు గురయ్యాడని కోర్టు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
పిటిషనర్ కి జరిగిన అన్యాయాన్ని డబ్బుతో మాత్రమే భర్తీ చేయలేమని, కానీ అతనికి కొంత ఉపశమనాన్ని ఇస్తుందని మహారాష్ట్ర సర్కార్ ఆరు వారాల్లో అతనికి రూ. 2 లక్షల పరిహారాన్ని అందించాలని ఆదేశించింది.
Read Also: S Jaishankar: “కెనడా తీవ్రవాదానికి ఆశ్రయం ఇస్తోంది”.. అమెరికాకు తేల్చిచెప్పిన జైశంకర్
కేసు ఏంటంటే..?
జూలై 17న ఐపీసీ సెక్షన్లు 354A (లైంగిక వేధింపులు) మరియు 509 (మహిళ అవమానించడం) ఆరోపణలపై టార్డియో పోలీసులు మిస్టర్ నితిన్‌ను అరెస్టు చేశారు. అయితే ఫీజు పెంచాలని అడిగినప్పుడు సదరు మహిళ కావాలనే తప్పుడు ఫిర్యాదు చేసిందని నితిన్ ఆరోపించారు. ఈ కేసులో బెయిల్ ఇచ్చేందుకు లాయర్ సిద్ధంగా ఉన్నప్పటికీ.. పోలీసులు నితిన్ ని వదిలి పెట్టకుండా, రాత్రంతా లాకప్ లో ఉంచారు. మరుసటి రోజు విడుదల చేశారు. ఈ కేసులో పోలీసులు నితిన్ కి క్షమాపణలు చెప్పారు. బాధ్యులైన పోలీసుల్ని శిక్షిస్తామని కోర్టుకు తెలిపారు. దీనిపై విచారణ జరిపేందుకు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ని నియమించాలని ముంబై కమిషనర్ని కోర్టు ఆదేశించింది.