High Court: మతాంతర జంటను నిర్భందించినందుకు పోలీసులపై అలహాబాద్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. వారిని వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్టోబర్ 15న కోర్టు ప్రాంగణంలోనే మతాంతర జంటను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు వారిని శనివారం న్యాయమూర్తులు సలీల్ కుమార్ రాయ్, దివేష్ చంద్ర సమంత్‌ల ధర్మాసనం ముందు హాజరుపరిచారు. షేన్ అలీ, రష్మీలను కస్టడీలోకి తీసుకోవడం ‘‘చట్టవిరుద్ధం’’అని ధర్మాసనం పేర్కొంది. ఎలాంటి ఆదేశాలు లేకుండా ఈ జంటను కస్టడీలోకి తీసుకున్నారని, వెంటనే…
ఏపీ హైకోర్టులో వైసీపీ నేతలకు రిలీఫ్ లభించింది. మచిలీపట్నం పోలీసులు కొడాలి నాని పై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని కొడాలి నానిపై కేసు నమోదైంది. కేసు క్వాష్ చేయాలని కొడాలి నాని పిటిషన్ దాఖలు చేశారు. కేసు విచారణపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. గుంటూరు మిర్చి యార్డులో పర్యటనలో ఎమ్మెల్సీ కోడ్ ఉల్లంఘించారని వైసీపీ ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, అప్పిరెడ్డి పై కేసు నమోదు కాగా... హైకోర్టులో క్వాష్ పిటిషన్…
Bombay High Court: ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘిస్తూ, అక్రమంగా నిర్భంధించిన కేసులో బాంబే హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. వ్యక్తిపై బెయిలబుల్ అభియోగాలు మోపినప్పటికీ పోలీసులు సదరు వ్యక్తి విడుదల చేయకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమంగా నిర్భంధంలో ఉంచినందుకు వ్యక్తికి రూ. 2 లక్షల పరిహారం చెల్లించాల్సిందిగా శుక్రవారం మహారాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఒక సంగీత ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేసి అక్రమంగా నిర్భంధించిన కేసులో పోలీసుల వైఖరిని ప్రశ్నించింది.