టికెట్ తీసుకోలేదన్న కోపంతో ఓ ప్రయాణీకుడి చెంప దెబ్బ కొట్టాడు కండక్టర్. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన కర్ణాటకలోని దేవనహళ్లి నుండి మెజెస్టిక్ కు వెళ్తున్న బీఎంటీసీ బస్సులో పోయిన గురువారం (ఆగస్ట్ 28) చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దేవనహళ్లి నుంచి బెంగళూరు మెజెస్టిక్‌కి వెళ్తున్న బీఎంటీసీ బస్సులో ఓ యువకుడు ఎక్కాడు. కండక్టర్ వచ్చి టికెట్ ఇస్తాడేమోనని యువకుడు ఎదురు చూస్తున్నాడు. ఇంతలో చెకింగ్…