Site icon NTV Telugu

Mumbai: ముంబై మేయర్‌గా రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్!

Ritutawde

Ritutawde

ముంబై మున్సిపల్ ఎన్నికలు జరిగి దాదాపుగా నెలరోజులవుతోంది. ఎన్నికల్లో బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. కానీ ఇప్పటి వరకు మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక జరగలేదు. ఈ పదవిపై బీజేపీ-శివసేన మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మేయర్ పదవిపై ఏక్‌నాథ్ షిండేకు చెందిన శివసేన కన్నేసింది. చివరికి ఆ పదవిని కూడా బీజేపీ తన్నుకుపోయింది. మేయర్ పదవి బీజేపీకి, డిప్యూటీ మేయర్ పదవి శివసేనకు దక్కింది. ఈ మేరకు చర్చలు ఫైనల్ అయ్యాయి. ఇక మేయర్‌గా బీజేపీకి చెందిన రీతూ తాన్డే.. డిప్యూటీ మేయర్‌గా సంజయ్ ఘడి ఎన్నికైనట్లుగా తెలుస్తోంది.

రీతూ తాన్డే..
రీతూ తాన్డే బీజేపీలో సీనియర్‌ నేతగా ఉన్నారు. ఇటీవల జరిగిన బీఎంసీ ఎన్నికల్లో గహత్కోపర్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. ఇదే నియోజకవర్గం నుంచి మూడు సార్లు కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. గతంలో విద్యా కమిటీ ఛైర్మన్‌గా పని చేసిన అనుభవం ఉంది. ఈ అనుభవంతో బీఎంసీ అభివృద్ధికి దోహపడుతుందని పార్టీ భావించింది. దీంతో మేయర్‌గా రీతూ తాన్డే నియామకంపై బీజేపీ హైకమాండ్‌తో చర్చించిన తర్వాత ఆమోదం లభించింది. ఇక డిప్యూటీ మేయర్‌గా ఏక్‌నాథ్ షిండేకు చెందిన దహిసర్ కౌన్సిలర్ సంజయ్ ఘడి ఎన్నికయ్యారు.

ఇది కూడా చదవండి: India-US Trade Deal: భారత్ మ్యాప్‌ విడుదల చేసిన అమెరికా.. పాకిస్థాన్‌కు స్ట్రాంగ్ సందేశం

Exit mobile version