Site icon NTV Telugu

MK Stalin: రాకెట్‌పై చైనా జెండా నేపథ్యంలో.. సీఎం స్టాలిన్‌కి చైనీస్ భాషలో బర్త్ డే విషెస్..

Mk Stalin

Mk Stalin

MK Stalin: తమిళనాడులో చైనా వివాదం కొనసాగుతోంది. ఇటీవల తమిళనాడు కులశేఖరపట్టణంలో ఇస్రో కొత్త స్పేస్‌పోర్టును నిర్మించడాన్ని పురస్కరించుకుని, అధికార డీఎంకే ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో ఇస్రోకు అభినందనలు తెలియజేస్తూ.. భారత రాకెట్‌పై చైనా జెండాను పెట్టింది. దీంతో ఒక్కసారిగా వివాదం ముదిరింది. బీజేపీ, అధికార డీఎంకే పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించింది. ప్రధాని మోడీ కూడా సీఎం స్టాలిన్, డీఎంకేలను టార్గెట్ చేస్తూ.. వారు భారత పురోగతిని కూడా చూడలేకపోతున్నారని, చైనా జపం చేస్తున్నారంటూ మండిపడ్డారు.

Read Also: Rameshwaram Cafe: బెంగళూర్ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు..

ఇదిలా ఉంటే, బీజేపీ శుక్రవారం ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కి చైనా భాష(మాండరిన్)లో పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో మరోసారి ఈ రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో వివాదం చెలరేగింది. తమిళనాడు బీజేపీ.. ‘‘ తమిళనాడు బీజేపీ తరుపున, మా గౌరవనీయులైన సీఎం తిరు ఎంకే స్టాలిన్‌కి ఆయనకు ఇష్టమైన భాషలో పుట్టిన రోజు శుభాకాంక్షలు’’ అంటూ ట్వీట్ చేసింది.

డీఎంకే మంత్రి అనిత రాధాకృష్ణన్ ఇస్రో ప్రకటనపై ఇలా బీజేపీ సెటైర్లు వేస్తోంది. డీఎంకే పార్టీ కేంద్ర పథకాలపై కూడా తమ స్టిక్కర్లను అంటించుకుంటుందని బీజేపీ మండిపడుతోంది. అయితే, ఈ చైనా జెండా విషయంలో డిజైనర్ పొరపాటు ఉందని, దీంట్లో డీఎంకేకి ఎలాంటి రహస్య ఉద్దేశాలు లేవని ఆ పార్టీ సర్దిచెప్పే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రకటనలో చిన్న పొరపాటు జరిగిందని, మాకు వేరు ఉద్దేశ్యం లేదని, మా హృదయాలల్లో భారతదేశంపై ప్రేమ మాత్రమే ఉందని అఖండ భారతానికి డీఎంకే కట్టుబడి ఉందని ఉద్ఘాటించింది.

Exit mobile version