MK Stalin: తమిళనాడులో చైనా వివాదం కొనసాగుతోంది. ఇటీవల తమిళనాడు కులశేఖరపట్టణంలో ఇస్రో కొత్త స్పేస్‌పోర్టును నిర్మించడాన్ని పురస్కరించుకుని, అధికార డీఎంకే ఓ ప్రకటన జారీ చేసింది. ఇందులో ఇస్రోకు అభినందనలు తెలియజేస్తూ.. భారత రాకెట్‌పై చైనా జెండాను పెట్టింది. దీంతో ఒక్కసారిగా వివాదం ముదిరింది. బీజేపీ, అధికార డీఎంకే పార్టీని తీవ్ర స్థాయిలో విమర్శించింది. ప్రధాని మోడీ కూడా సీఎం స్టాలిన్, డీఎంకేలను టార్గెట్ చేస్తూ.. వారు భారత పురోగతిని కూడా చూడలేకపోతున్నారని, చైనా జపం…