NTV Telugu Site icon

Ajit Pawar: సీఎం యోగి ‘‘బాటేంగే’’ నినాదం మహారాష్ట్రలో పనిచేయదు..

Ajit Pawar

Ajit Pawar

Ajit Pawar: మహారాష్ట్ర ఎన్నికల ప్రచారం జోరందుకుంది. నవంబర్ 20న రాష్ట్రంలోని 288 స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’ కూటమి, ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి తలపడుతున్నాయి. బీజేపీ ఇప్పటికే రాష్ట్రంలో తన ప్రచారాన్ని ఉద్ధృతం చేసింది. ఇదిలా ఉంటే యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చేసిన ‘‘బాటేంగే తో కటేంగే’’( విడిపోతే, దెబ్బతింటాం) అనే నినాదంపై వివాదం చెలరేగింది.

Read Also: Amit Shah: మహారాష్ట్ర నెక్స్ట్ సీఎం ఏక్‌నాథ్‌ షిండే కాదు.. సీఎం అభ్యర్థి ఎంపికపై షా కీలక ప్రకటన

బీజేపీ మహాయుతి కూటమిలో మిత్రపక్షమైన ఎన్సీపీ యోగి నినాదంపై విమర్శలు చేస్తోంది. ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ మాట్లాడుతూ.. ఈ నినాదాన్ని ఖండించారు. ఇది రాష్ట్రంలో పనిచేయదని పేర్కొన్నాడు. ఎన్నికల్లో అభివృద్ధి అంశాలపై దృష్టిసారించాలని సూచించాడు. “నేను ఈ నినాదాన్ని ఆమోదించను. మహారాష్ట్రలో ఇది పనిచేయదని నేను పదేపదే చెప్పాను; ఇది ఉత్తరప్రదేశ్ లేదా జార్ఖండ్ వంటి ప్రదేశాలలో పనిచేయవచ్చు, కానీ ఇక్కడ కాదు.’’ అని అన్నారు.

ముఖ్యంగా ఈ నినాదం హర్యానా ఎన్నికల్లో బలంగా పనిచేసింది. హిందువులు ఐక్యంగా ఉండాలని సూచించడంతో పాటు భారత్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్ పరిస్థితిని, బంగ్లాదేశ్‌లో హిందువుల పరిస్థితిని గురించి యోగి ఈ వ్యాఖ్యలు చేశాడు. దీనికి తోడు ఇటీవల కాలంలో కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు కులగణన పేరుతో హిందువుల్లో విభజన రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపిస్తూ యోగి ఈ నినాదాన్ని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్రమోడీ “ఏక్ హైన్ తో సేఫ్ రహేంగే” (మనం ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటాం) అంటూ ప్రచారం చేస్తున్నారు.

Show comments