Sandeshkhali: మహిళలపై టీఎంసీ నేత అఘాయిత్యాలతో అట్టుడుకుతున్న “సందేశ్‌ఖాలీ”..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sandeshkhali: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో “సందేశ్‌ఖాలీ” ప్రకంపనలు రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నేత షాజహాన్ షేక్, అతని అనుచరుల చేతిలో లైంగిక వేధింపులు, చిత్ర హింసలకు గురైన మహిళలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. అతనిపై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఆందోళనలకు బీజేపీ మద్దతు తెలుపుతోంది. సోమవారం గవర్నర్ సీవీ ఆనంద్ బోస్ మహిళలతో మాట్లాడారు. మహిళలు తాము ఎదుర్కొన్న అఘాయిత్యాలు., అన్యాయాల గురించి గవర్నర్ వద్ద వెల్లబోసుకున్నారు.
Read Also: Farmers Protest: “బలాన్ని ఉపయోగించడం..” రైతుల ఆందోళనపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
Also Read
- PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
మంగళవారం బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. బీజేపీ మద్దతుదారులు ఎస్పీ కార్యాలయం వైపు మార్చ్‌గా వెళ్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడం ఆందోళనకు దారి తీసింది. లాఠీచార్జి చేసి పోలీసులు గుంపును చెదరగొట్టారు. ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. 24 పరగనాల జిల్లాలోని సందేశ్‌ఖాలీ ప్రాంతంలో షాజహాన్ షేక్ అన్యాయాలు, లైంగిక వేధింపులకు పాల్పడటమే కాకుండా.. తన భూముల్ని స్వాధీనం చేసుకున్నారని మహిళలు ఆరోపిస్తున్నారు.
గత నెలలో రేషన్ కుంభకోణం కేసులో షాజహాన్ ఇంట్లో సోదాలకు వెళ్లిన సమయంలో ఈడీ అధికారులపై అతడు, అతని అనుచరులు దాడి చేశారు. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. ఈ నేపథ్యంలోనే మహిళలపై అతడు, అతని గుండాల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు, సందేశ్‌ఖాలీలో సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద నిషేధ ఉత్తర్వులు జారీ చేయడాన్ని కలకత్తా హైకోర్టు మంగళవారం పక్కన పెట్టింది. ఆ ప్రాంతంలోని నిషేధాజ్ఞలను ఎత్తివేసేలా ఆదేశించాలని కోరుతూ సందేశ్‌ఖాలీకి చెందిన ఇద్దరు నివాసితులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!