హర్యానాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. స్థానిక ఎన్నికల్లో మరోసారి ఓటమి పాలైంది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ పరాజయం పాలైంది. తాజాగా మార్చి 2న ఏడు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరిగాయి. ఫరీదాబాద్, హిసార్, రోహతక్, కర్నాల్, యమునానగర్, గురుగ్రామ, మనేసర్‌కు ఎన్నికలు జరిగాయి. బుధవారం కౌంటింగ్ జరగగా.. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ హుడాకు కంచుకోట అయిన గురుగ్రామ్ మరియు రోహ్‌తక్‌ల కూడా హస్తం పార్టీ ఓడిపోయింది. వరుసగా రెండోసారి ఓటమితో కాంగ్రెస్ డీలా పడింది.
ఇది కూడా చదవండి: Jana Nayagan : విజయ్ సినిమా కోసం రంగంలోకి ముగ్గురు దర్శకులు..?
రోహ్‌తక్‌లో కాంగ్రెస్ ఓటమి
రోహ్‌తక్ మేయర్ సీటు కోసం జరిగిన పోరులో కాంగ్రెస్ ఓటమి పాలైంది. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్, ఒక స్వతంత్ర అభ్యర్థి పోటీ పడ్డారు. కానీ బీజేపీ అభ్యర్థి రామ్ అవతార్ తిరుగులేని విజేతగా నిలిచారు. ఆయనకు లక్షకు పైగా ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ అభ్యర్థి సూరజ్మల్ కిలోయ్‌కి 45,000 ఓట్లు రావడంతో రెండో స్థానంలో నిలిచారు. దాదాపుగా అన్ని స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఎక్కడా కూడా కాంగ్రెస్ ప్రభావం చూపించలేదు.
ఇది కూడా చదవండి: AP Legislative Council: ఏపీ శాసన మండలికి మార్షల్స్.. దాడికి ప్రయత్నిస్తారా అంటూ బొత్స ఫైర్!