Congress Vs BJP: కుంభమేళాకు హాజరుకాకపోవడంపై నేతల మధ్య మాటల యుద్ధం
- బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం
- కుంభమేళాకు హాజరుకాకపోవడంపై నేతల మధ్య డైలాగ్ వార్
- సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలు విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కుంభమేళా, అయోధ్య కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య మరోసారి మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధాని మోడీ గుజరాత్‌లోని సోమనాథ్ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా కాంగ్రెస్‌పై బీజేపీ మాటల దాడి చేసింది. కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్‌గాంధీ, మల్లిఖార్జున ఖర్గేలను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించింది. 2024లో అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి హాజరకాలేదు. 2025లో మహా కుంభమేళాకు కాంగ్రెస్ నాయకులు హాజరుకాలేదని.. వాళ్లంతా హిందూ వ్యతిరేకులని బీజేపీ ధ్వజమెత్తింది. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఫొటోలు పెట్టి విమర్శలు చేసింది.
ఇది కూడా చదవండి: Prashanth Reddy: ఎస్ఎల్బీసీని మంత్రులు వినోద యాత్రగా మార్చుకున్నారు
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
- UP: ఏం త్యాగం.. ఐదుగురు పిల్లల తల్లిని ప్రియుడికిచ్చి పెళ్లి చేసిన భర్త.. ఏం జరిగిందంటే..!
- Rahul Gandhi vs BJP: విద్యార్థులతో రాజకీయాలెందుకు? రాహుల్‌గాంధీని ప్రశ్నించిన బీజేపీ
‘‘రాహుల్ గాంధీ కుటుంబం మొత్తం హిందూ మతాన్ని వ్యతిరేకిస్తుంది. వారు బాబర్ (అయోధ్యలోని బాబ్రీ మసీదు) నిర్మించిన మసీదుకు మూడుసార్లు వెళ్లారు కానీ రాముడి ఆలయంలో శ్రీరాముని దర్శనం కోసం వెళ్లలేదు. రాహుల్ గాంధీ తరచుగా రాయ్‌బరేలికి వెళ్తారు. కానీ ఆయన ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరిగే ప్రదేశానికి వెళ్లలేకపోయారు. ఇది కేవలం 2 గంటల రెండు నిమిషాల 120 కి.మీ. దూరంలో ఉంది’’ అని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి పేర్కొన్నారు.
ఇక హిందీ పోస్టులో బీజేపీ మరో విమర్శ చేసింది. ‘‘శతాబ్దాల పోరాటం మరియు నిరీక్షణ తర్వాత అయోధ్యలో ఒక గొప్ప రామాలయం నిర్మించబడింది. మోడీ చేతుల మీదుగా జనవరి 22, 2024న రామ్‌లాలా ప్రాణ ప్రతిష్ట జరిగింది. కానీ ఆలయ నిర్మాణాన్ని ఎప్పుడూ వ్యతిరేకించే కాంగ్రెస్, రాహుల్ గాంధీ ఆహ్వానం అందుకున్న తర్వాత కూడా వేడుకకు హాజరు కాలేదు. కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును సంతృప్తి పరచుకోవడానికి హిందువుల మనోభావాలను ఎప్పుడూ దెబ్బతీస్తుంది’’ అని బీజేపీ పేర్కొంది.
ఇది కూడా చదవండి: AA23 : అల్లు అర్జున్ – అట్లీ సినిమాలో మరొక హీరో.?
బీజేపీ విమర్శలను మల్లిఖార్జున ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే ఖండించారు. బీజేపీ వాదన ప్రకారం.. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్రమంత్రి హెచ్డీ కుమారస్వామి వంటి మిత్రపక్షాల నాయకులు కూడా కుంభమేళాకు హాజరుకాలేదు. వీళ్లను కూడా హిందూ వ్యతిరేకులుగా పరిగణించాలా? అని బీజేపీని ప్రశ్నించారు.
सदियों के लंबे संघर्ष और इंतजार के बाद अयोध्या में भव्य राम मंदिर का निर्माण हुआ, जिसमें प्रधानमंत्री श्री @narendramodi के कर कमलों द्वारा 22 जनवरी, 2024 को प्रभु श्री रामलला की प्राण प्रतिष्ठा हुई।
लेकिन हमेशा से ही मंदिर निर्माण का विरोध करने वाली कांग्रेस और राहुल गांधी… pic.twitter.com/JZjr5Ai9ga
— BJP (@BJP4India) March 2, 2025
Dear @BJP4India,
Here’s a list of more so-called “anti-Hindus” who didn’t attend #MahaKumbh:
•Half of your Union Ministers
•More than half of BJP legislators across the country
•Most of your IT Cell warriorsAnd let’s not forget your allies:
•Sri Nitish Kumar
•Sri… https://t.co/t8G9W1wrKC— Priyank Kharge / ಪ್ರಿಯಾಂಕ್ ಖರ್ಗೆ (@PriyankKharge) March 2, 2025
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్‌బాల్ మ్యాచ్‌పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్‌వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!