Site icon NTV Telugu

Raj Thackeray: పవార్‌, ఠాక్రే బ్రాండ్లను అంతం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది..

Takery

Takery

Raj Thackeray: భారతీయ జనతా పార్టీపై మహారాష్ట్ర నవనిర్మాణ సేన (MNS) చీఫ్ రాజ్‌ఠాక్రే హాట్ కామెంట్స్ చేశారు. మహారాష్ట్ర రాజకీయాల్లో పవార్‌, ఠాక్రే బ్రాండ్లను అంతం చేసేందుకు కమలం పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కానీ, అలాంటివి జరిగే ప్రసక్తే లేదన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

అయితే, ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రే తాజాగా మాట్లాడుతూ.. ఠాక్రే బ్రాండ్‌ అంతం చేయాలని బీజేపీ ట్రై చేస్తుంది.. అది అంత ఈజీ కాదు.. ఠాక్రే బ్రాండ్‌ విషయానికి వస్తే నా తాత ప్రభోదంకర్ ఠాక్రే మహారాష్ట్రపై తొలుత ప్రభావాన్ని చూపించారు.. ఆ తర్వాత బాలాసాహెబ్ ఠాక్రే, తరువాత నా తండ్రి శ్రీకాంత్‌ ఠాక్రే తమదైన ముద్ర వేశారని చెప్పుకొచ్చారు. అనంతరం, ఠాక్రే వారుసులమైన నేను, ఉద్దవ్‌ ఠాక్రే మా సత్తా ఏంటో చూపించాం అని వెల్లడించారు.

Read Also: Malavika : అనుకున్నా గౌరవం దక్కింది..

కాగా, ఈ మధ్య నేను ఒక ఫోటో చూశాను.. అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది అని రాజ్‌ఠాక్రే అన్నారు. ఓ కార్యక్రమంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్, సునీల్ తత్కరే, అశోక్ చవాన్, నారాయణ్ రాణే, ఛగన్ భుజ్‌బాల్ సహా ఇతర నాయకులు కూర్చున్నారు. ఆ ఫోటో చూసినప్పుడు.. అవినీతి నాయకులకు అడ్డగా మహాయుతి ప్రభుత్వం ఉందని అర్థమైందని ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రే ఆరోపించారు. మరోవైపు, దాదాపు రెండు దశాబ్దాల తర్వాత తన సోదరుడు శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేతో రాజ్‌ఠాక్రే సయోధ్య కుదుర్చుకునే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని అనుమానాలు కలుగుతున్నాయి.

Exit mobile version