Salman Khurshid: కాంగ్రెస్ నేత, సీడబ్ల్యూసీ సభ్యుడు సల్మాన్ ఖుర్షీద్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్ అవుతోంది. ఇండియాలో కూడా ‘‘బంగ్లాదేశ్ పరిస్థితులు’’ రావచ్చని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. మంగళవారం ఖుర్షీద్ మాట్లాడుతూ.. ‘‘బయటకు ప్రతీది సాధారణంగా కనిపించొచ్చు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతుందో అది భారత్‌లో కూడా జరగొచ్చు’’ అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
Read Also: Rash Car Driving: అతివేగంతో కారు నడుపుతూ మూడు బైకులను ఢీకొట్టిన మైనర్ బాలుడు..
బీజేపీ ఎంపీ రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ.. ఖర్షీద్ వ్యాఖ్యలు అరాచకవాదంగా విమర్శించారు. సీడబ్ల్యూసీ సభ్యుడైన ఓ వ్యక్తి ఇలాంటి ప్రకటనలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ తన వైఫల్యాన్ని దాచడానికి ఇలాంటి అరాచక ప్రకటనల్ని ఆశ్రయించడం దురదృష్టకరమని అన్నారు.
బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర స్పందిస్తూ.. ఖుర్షీద్‌కి అతడి పార్టీ వార్నింగ్ ఇచ్చిందని అన్నారు. ఇలాంటి ప్రకటనల్ని చూస్తున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ దేశంలో ఇలాంటి పరిస్థిని కోరుకుంటుంటోందని ఆరోపించారు. బంగ్లాదేశ్‌లాగే భారత్‌లో కూడా నిరసనలు, దహనాలు జరుగుతాయని మరికొందరు కాంగ్రెస్ నేతలు అన్నారని ఆయన పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్ పార్టీ విధానం ఏంటి..? రాహుల్ గాంధీ ఈ దేశంలో అల్లర్లు జరుగుతాయని, ప్రధాని మోడీపై దాడులు జరుగుతాయని, ఎందుకు చెబుతున్నారు’’ అని పాత్ర పశ్నించారు. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల్లో భారత వ్యతిరేక వ్యాఖ్యల్ని కూడా ప్రశ్నించారు. దేశంలో ఎన్నికల్లో గెలవలేక ఇలాంటి అరాచక శక్తుల్ని ప్రోత్సహించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ఆరోపించారు.