Bihar elections: బీహార్ ఎన్నికలకు మరికొన్ని రోజులే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఎన్డీయే పార్టీలో పొత్తులు కూడా పూర్తయ్యాయి. మొత్తం 243 సీట్లకు గానూ బీజేపీ, జేడీయూలు చెరో 101 స్థానాల్లో పోటీ చేస్తుంగా, చిరాగ్ పాశ్వాన్ ఎల్జేపీ(రామ్ విలాస్) 29 స్థానాల్లో పోటీ చేయనుంది. మిగిలిన స్థానాలు ఎన్డీయే మిత్రపక్షాలకు దక్కాయి.
Read Also: NTR : డ్రాగన్ మూవీ ఓటీటీ రీలీజ్‌పై.. సెన్సేషనల్ అప్‌డేట్!
ఇదిలా ఉంటే, మంగళవారం బీజేపీ తన అభ్యర్థుల తొలి లిస్ట్‌ను విడుదల చేసింది. 71 మంది అభ్యర్థుల్ని ఖరారు చేసింది. ఉపముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాలు తొలి జాబితాలోనే ఉ న్నారు. వీరిద్దరు వరసగా తారాపూర్, సిన్హా లఖిసరాయి నుంచి పోటీ చేస్తారు. ఫస్ట్ లిస్టులో ఉన్న ముఖ్యమైన నాయకుల్లో రామ్ కృపాల్ యాదవ్ దనాపూర్ నుంచి పోటీ చేయనున్నారు, ప్రేమ్ కుమార్ గయ నుంచి ప్రేమ్ కుమార్, కతిహార్ నుంచి మాజీ ఉప ముఖ్యమంత్రి తారకిషోర్ ప్రసాద్, సహర్సా నుంచి అలోక్ రంజన్ ఝా, సివాన్ నుంచి మంగళ్ పాండే ఉన్నారు.
243 మంది సభ్యులు ఉన్న బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. కౌంటింగ్ నవంబర్ 14న జరుగుతుంది.
