Site icon NTV Telugu

Arvind Kejriwal: కేజ్రీవాల్ మామిడి పండ్లు తినడంపై స్పందించి ఆప్.. చంపేందుకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపణ..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ని ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అతను తీహార్ జైలులో ఉన్నాడు. అయితే జైలులో కేజ్రీవాల్ మామిడిపండ్లు, స్వీట్లు, ఆలూ పూరీలు తింటున్నాడని, షుగర్ వ్యాధితో బాధపడుతున్న కేజ్రీవాల్ తన షుగర్ లెవల్స్ పెంచుకుని, అనారోగ్య సమస్యలతో బెయిల్ పొందాలని చూస్తున్నారంటూ ఈడీ కోర్టులో ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఢిల్లీ సీఎం హత్యకు జైల్లో పథకం రచిస్తు్న్నారని ఆరోపించింది. కేజ్రీవాల్‌ని చంపేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారంటూ ఢిల్లీ మంత్రి అతిషి ఆరోపించారు.

Read Also: Lok sabha election: ఎన్నికల వేళ బాలీవుడ్ నటుల డీప్‌ఫేక్ వీడియోలు.. లేటెస్ట్‌గా బుక్కైన మరో నటుడు

‘‘ఇది మోడీ, బీజేపీ చేసిన కుట్ర, కేజ్రీవాల్‌ని చంపడానికి కుట్ర పన్నారు. జైలులో ఆయనకు ఇంటి భోజనాన్ని నిలిపివేయాలని ఈడీ, బీజేపీ భావిస్తున్నాయి. కోర్టులో అతను స్వీట్లు, టీ తాగుతున్నాడని ఈడీ ప్రస్తావించింది. ఇది పూర్తిగా అబద్ధం’’ అని అతిషి చెప్పారు. కేజ్రీవాల్ రెండు అరటి పండ్లు తినడం అనేది ఈడీ రెండో అబద్ధమని, షుగర్ పేషెంట్లు అత్యవసర పరిస్థితుల్లో చాక్లెట్లు, అరటిపండ్లు తమతో ఉంచుకోవాలని ఎప్పుడూ కోరుతారు. మూడో అబద్ధం ఆలూపూరీ తినడమని ఆమె అన్నారు. ఈడీ సమర్పించిన డైట్ చార్ట్‌లో కేజ్రీవాల్‌కి ఒక రోజు మాత్రమే పూరీ ఉందని, అది కూడా నవరాత్రి మొదటి రోజని, అతనికి మీరు నవరాత్రి ప్రసాదాన్ని అనుమతించలేదా..? అని ప్రశ్నించారు.

డయాబెటిక్‌తో బాధపడుతున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కావాలనే జైల్లో తీపి పదార్థాలు తింటున్నారని, తద్వారా షుగర్ లెవల్స్ పెరిగి వైద్యపరమైన కారణాలతో బెయిల్ పొందాలని చూస్తున్నారని బీజేపీ నేత మజీందర్ సింగ్ సిర్సా అన్నారు. కేజ్రీవాల్ వైద్యపరమైన కారణాలతో జైలులో ‘‘చక్కెర కుంభకోణం’’లో మునిగిపోయారని ఆరోపించారు. మద్యం కుంభకోణం, ఇప్పుడ చక్కెర కుంభకోణానికి పాల్పడుతున్నాడని ఎద్దేవా చేశారు.

Exit mobile version