Varun Gandhi: ‘ఎగిరే శవపేటికలను ఎప్పుడు వదిలించుకుంటారు’.. వరుణ్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Gandhi: రాజస్థాన్‌లో బార్మర్ సమీపంలో శిక్షణా కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి మిగ్-21 విమానం కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లను మిగ్-21 బలి తీసుకుంది. ఈ పాత కాలపు జెట్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని విరమించుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, తాజా దుర్ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎగిరే శవ పేటికలను ఇంకెప్పుడు భారత వైమానిక దళం నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
“నిన్న బార్మర్‌లో జరిగిన ఘటనతో దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైంది. కొన్నేళ్లుగా మిగ్-21 తరచుగా ప్రమాదాలకు గురవుతోంది. ఈ విమానం ఇప్పటివరకు దాదాపు 200 మంది పైలట్లను బలిగొంది. ఈ ‘ఎగిరే శవపేటిక’ను వైమానిక దళం విమానాల నుండి ఎప్పుడు తొలగిస్తారు? దేశంలోని పార్లమెంటు ఆలోచించాలి, మన పిల్లలను ఈ విమానాన్ని నడిపేందుకు అనుమతిస్తామా?” అని వరుణ్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు.
Also Read
Pending Cases in Courts: దేశంలో దాదాపు 5కోట్ల కేసులు పెండింగ్.. పార్లమెంట్లో కేంద్రం వెల్లడి
గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో వింగ్ కమాండర్ ఎం రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ భల్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా.. భారత వైమానిక దళం ఈ సెప్టెంబర్ చివరి నాటికి మిగ్-21 విమానాల సేవలను నిలిపివేయాలనుకుటోంది. దాంతో మిగ్ 21 బైసన్ స్క్వాడ్రన్‌లో మూడు మాత్రమే మిగిలి ఉంటాయి. ఇవి కూడా ప్రతి ఏడాదికి ఒకటి చొప్పున రిటైర్ అవుతూ 2025 నాటికి పూర్తిగా వైమానిక దళాన్ని వీడనున్నాయని తెలుస్తోంది. వింగ్ కమాండర్ రాణా హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారని, ఫ్లైట్ లెఫ్టినెంట్ భల్ జమ్ము కశ్మీర్‌కు చెందిన వారని ఐఏఎఫ్ అధికారి ఒకరు తెలిపారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
-
Anantha Sriram: “విషం కక్కే రివ్యూల దారిద్యాన్ని దాటి ‘పెద్ది’ బాక్సాఫీస్ బద్దలుకొట్టింది!
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!