భారత వాయుసేనకు చెందిన ఇద్దరు పైలట్లను మిగ్-21 బలి తీసుకుంది. ఈ పాత కాలపు జెట్ల కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని, వీటిని విరమించుకోవాలని చాలా కాలంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. కాగా, తాజా దుర్ఘటనపై భాజపా ఎంపీ వరుణ్ గాంధీ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ ఎగిరే శవ పేటికలను ఇంకెప్పుడు భారత వైమానిక దళం నుంచి తొలగిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన మిగ్-21 యుద్ధ విమానం రాజస్థాన్‌లోని బర్మర్ జిల్లాలో ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. కూలిన మిగ్-21 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు భారత వైమానిక దళం వెల్లడించింది.