NTV Telugu Site icon

Atul Subhash case: ‘‘మగాళ్లు బలవుతున్నారు’’.. పార్లమెంట్‌లో బీజేపీ ఎంపీ..

Dinesh Sharma

Dinesh Sharma

Dinesh Sharma: గృహ హింస, మహిళలపై దోపిడీ చట్టాలను దుర్వినియోగం చేయడంపై గత కొంత కాలంగా దేశంలో చర్చ నడుస్తోంది. బెంగళూర్ టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అతడి భార్య తప్పుడు గృహహింస, వరకట్న వేధింపుల కేసులు పెట్టిన కారణంగా తాను ఎదుర్కొన్న ఇబ్బందుల్ని పేర్కొంటూ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలే చోటు చేసుకున్నాయి. దీంతో ఇలా చట్టాలను దుర్వినియోగం చేసే మహిళలపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు.

అయితే, ‘‘సుభాష్ ఆత్మహత్య’’ అంశాన్ని బీజేపీ రాజ్యసభ ఎంపీ దినేశ్ శర్మ పార్లమెంట్‌లో లేవనెత్తాడు. తప్పుడు ఆరోపణలపై, చట్టాల దుర్వినియోగంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇలా తప్పుడు నేరాలు ఎదుర్కొంటున్న మగవాళ్లకు చట్టపరమైన, భావోద్వేగ మద్దతు ఇవ్వాలని దినేశ్ శర్మ డిమాండ్ చేశారు. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Read Also: Uttar Pradesh : కొత్త పెళ్లైన జంట మధ్య బొట్టు బిళ్ల పెట్టిన చిచ్చు.. చివరికి ఏమైందంటే ?

సోమవారం రాజ్యసభలో ఎంపీ దినేష్ శర్మ జీరో అవర్ సమయంలో అతుల్ సుభాష్ ఆత్మహత్యను ప్రస్తావించారు. ఈ సమయంలో, గృహ హింస మరియు వేధింపులకు సంబంధించిన చట్టాలను లింగ తటస్థంగా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గృహహింస, దోపిడీ నుంచి మహిళలకు రక్షణ కల్పించడంలో చట్టం ఎంతో పురోగతి సాధించిందని, అయితే ఇలాంటి హింస, దోపిడీ నుంచి పురుషులకు రక్షణ లేకపోవడం ఆందోళన కలిగిస్తోందని ఎంపీ అన్నారు.

ఆత్మహత్యలకు సంబంధించిన ఎన్‌సీఆర్‌బీ గణాంకాలను కూడా దినేశ్ శర్మ సభలో వెల్లడించారు. 2022లో భారతదేశంలో ఆత్మహత్యలు చేసుకున్న వారిలో 72 శాతం మంది అంటే మొత్తం 1,25,000 మంది పురుషులు కాగా, మహిళల సంఖ్య దాదాపు 47,000 అని ఆయన చెప్పారు. 2014 మరియు 2021 మధ్య పురుషులు మరియు మహిళల మధ్య ఆత్మహత్యల నిష్పత్తిలో గణనీయమైన పెరుగుదల ఉంది. ఈ కాలంలో 107.5 శాతం మంది పురుషులు ఆత్మహత్యలకు కుటుంబ సమస్యలే కారణమని పేర్కొన్నారు.