Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు
- బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు
- భయపడేదిలేదని నటుడు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్ చేసి ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ మత విశ్వాసాల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్లో శివం ద్వివేది ఫిర్యాదు చేశాడు.
ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!
Also Read
‘‘రవి కిషన్ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. అతని ప్రతి కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బిహార్‌కు వచ్చేటప్పుడు.. చంపేస్తాం’’ అని బెదిరించారని శివం ద్వివేది పేర్కొన్నాడు. అయితే రవికిషన్ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ.. ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది క్లారిటీ ఇచ్చాడు. ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. నిందితుడు బిహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్ కుమార్‌గా గుర్తించారు.
ఇది కూడా చదవండి: Prashant Kishor: జన్ సురాజ్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన ప్రశాంత్ కిషోర్
రవికిషన్ స్పందన..
ఇక బెదిరింపులపై రవికిషన్ స్పందించారు. తాను ఎలాంటి బెదిరింపులకు లొంగిపోనని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్లో తనను దుర్భాషలాడటంతో పాటు తల్లి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలని తెలిపారు. ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవాలనేది తన రాజకీయ వ్యూహం మాత్రమే కాదని.. జీవిత సంకల్పమని వ్యాఖ్యానించారు.
ఇది కూడా చదవండి: JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన
मुझे हाल ही में फ़ोन पर अपशब्द कहे गए, मेरी माता जी को लेकर भी अभद्र भाषा का प्रयोग किया गया। यहां तक कि मुझे जान से मारने की धमकियां दी गईं और प्रभु श्रीराम के प्रति अपमानजनक शब्द कहे गए। यह न केवल मेरे व्यक्तिगत सम्मान पर, बल्कि हमारी आस्था और भारतीय संस्कृति के मूल तत्वों पर…
— Ravi Kishan (@ravikishann) October 31, 2025
తాజావార్తలు
-
Carrot Oil : ముఖం గ్లో అవ్వాలా.? క్యారెట్ నూనెతో మెరిసే చర్మం..
-
INDIA alliance: రేపే ఇండియా కూటమి సమావేశం.. 23 పార్టీలు హాజరయ్యే ఛాన్స్..
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!