Site icon NTV Telugu

Ravi Kishan: బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు బెదిరింపులు.. భయపడేదిలేదన్న నటుడు

Ravi Kishan

Ravi Kishan

ప్రముఖ సినీ నటుడు, బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు హత్యా బెదిరింపులు వచ్చాయి. ఎంపీ వ్యక్తిగత కార్యదర్శి శివం ద్వివేదికి ఫోన్‌ చేసి ఒక వ్యక్తి బెదిరింపులకు పాల్పడ్డాడు. తమ మత విశ్వాసాల గురించి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బెదిరింపు కాల్ చేశాడు. దీంతో గోరఖ్‌పూర్‌ పోలీస్ స్టేషన్‌లో శివం ద్వివేది ఫిర్యాదు చేశాడు.

ఇది కూడా చదవండి: Gold Rates: పసిడి ప్రియులకు శుభవార్త.. ఈరోజు ఎంత తగ్గిందంటే..!

‘‘రవి కిషన్‌ మా వర్గాన్ని అవమానించేలా మాట్లాడాడు. కాబట్టి అతన్ని కాల్చేస్తాం. అతని ప్రతి కదలిక నాకు తెలుసు. నాలుగు రోజుల్లో అతను బిహార్‌కు వచ్చేటప్పుడు.. చంపేస్తాం’’ అని బెదిరించారని శివం ద్వివేది పేర్కొన్నాడు. అయితే రవికిషన్‌ ఏ వర్గాన్ని ఉద్దేశిస్తూ.. ఎలాంటి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయలేదని ద్వివేది క్లారిటీ ఇచ్చాడు. ఎంపీకి భద్రత పెంచాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు .. నిందితుడు బిహార్‌లోని అరా జిల్లాకు చెందిన అజయ్‌ కుమార్‌గా గుర్తించారు.

ఇది కూడా చదవండి: Prashant Kishor: జన్ సురాజ్‌ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన ప్రశాంత్ కిషోర్

రవికిషన్‌ స్పందన..
ఇక బెదిరింపులపై రవికిషన్‌ స్పందించారు. తాను ఎలాంటి బెదిరింపులకు లొంగిపోనని చెప్పారు. గుర్తుతెలియని వ్యక్తి ఫోన్‌ కాల్‌లో తనను దుర్భాషలాడటంతో పాటు తల్లి గురించి అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని పేర్కొన్నారు. సమాజంలో ద్వేషం, అరాచకత్వాన్ని వ్యాప్తి చేసే ప్రయత్నాలని తెలిపారు. ప్రజాసేవ, ధర్మమార్గంలో నడవాలనేది తన రాజకీయ వ్యూహం మాత్రమే కాదని.. జీవిత సంకల్పమని వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి: JD Vance: భార్య మతంపై జేడీ వాన్స్ మరోసారి కీలక ప్రకటన

 

Exit mobile version