కల్నల్ సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర ఇబ్బందులకు గురైన మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా మరోసారి ఇరకాటంలో పడ్డారు. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఫొటో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఆయన మరోసారి విమర్శల పాలయ్యారు.
ఇది కూడా చదవండి: Samantha : గోల్డెన్ శారీలో మెరిసిపోయిన సామ్..
మంత్రి విజయ్ షా.. అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. పరిహారానికి సంబంధించిన చెక్కును అందజేశారు. అత్యాచార ఘటనల విషయంలో గోప్యతా పాటించాల్సిన అవసరం ఉంటుంది. దీన్ని మంత్రి ఉల్లంఘించి.. ఆమె కుటుంబానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. దీంతో మంత్రి గోప్యతను ఉల్లంఘించారంటూ విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్య నారాయణకు అస్వస్థత!
ఇటీవల ఖాండ్వాలో హత్యాచారానికి గురైన బాధిత కుటుంబాన్ని మంత్రి విజయ్ షా పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తూ.. నాయకులను, పార్టీ కార్యకర్తలను వెంట వేసుకుని వెళ్లారు. అక్కడ బాధిత కుటుంబాన్ని పరామర్శించి చెక్ అందజేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు తీసిన ఫొటోలను కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో ఈ వ్యవహారం మరోసారి వివాదానికి తెరలేపింది. గోపత్యాను మంత్రి ఉల్లంఘించారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
ఇక పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది చనిపోయారు. దీనికి ప్రతీకారంగా భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనికి కల్నల్ సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు మీడియాకు తెలియజేస్తూ ఉండేవారు. దీంతో ఆమె మీడియాలో పాపులర్ అయ్యారు.
అయితే ఓ పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొన్న మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా.. సోఫియా ఖురేషిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. పహల్గామ్లో ఉగ్రవాదులు.. మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేస్తే.. అదే ఉగ్రవాదుల మతానికి చెందిన సోఫియాఖురేషిని ప్రధాని మోడీ పాకిస్థాన్‌పైకి పంపించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మతపరమైన వ్యాఖ్యలు చేయడంతో తీవ్ర దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ హైకోర్టు కేసు నమోదు చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా సర్వోన్నత న్యాయస్థానం కూడా చీవాట్లు పెట్టింది. మంత్రి క్షమాపణలు అంగీకరించబోమని తెలిపింది. తాజాగా మంత్రి మరోసారి వివాదంలో ఇరుక్కున్నారు.