UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
- మధురలో బీజేపీ రెండు రోజుల మేధోమథన సమావేశం..
- 2027 అసెంబ్లీ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేస్తున్న బీజేపీ..
- అయోధ్య, వారణాసి తర్వాత మధుర శ్రీ కృష్ణ జన్మభూమిపై కాషాయ పార్టీ దృష్టి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UP Elections 2027: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీజేపీ తన అజెండా, ప్రచారానికి పదును పెట్టింది. మధురలో సోమవారం రెండు రోజుల మేధోమథన సమావేశంలో నేతలు పాల్గొన్నారు. అయోధ్య, వారణాసి తర్వాత బీజేపీ శ్రీకృష్ణ జన్మభూమిని కీలక రాజకీయ అజెండాలో చేర్చింది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్లు, రాబోయే ఎన్నికల్లో ఎన్నికల వ్యూహాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై ప్రభుత్వం, పార్టీ సంస్థాగత నాయకత్వం మధ్య సనన్వయం పెంచాలని బీజేపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
మధురలోని పండిత్ దీన్‌దయాల్ ఉపాధ్యాయ గో పరిశోధనా కేంద్రంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్, జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు, కీలక నాయకులు సహా 50 మంది పాల్గొన్నారు.
Also Read
- Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
- Sonia Gandhi Memoir: సోనియా గాంధీ ఆత్మకథలో తప్పులు.. దాచిన విషయాలే వివాదాలు!
- Giacomo Filibeck: కాంగ్రెస్‌కు మద్దతుగా ‘ఓట్ చోర్’ నినాదాలు.. ఇటలీ నేతను బ్లాక్‌లిస్ట్ చేసిన ఫిలిప్పీన్స్!
- Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
అయోధ్య, కాశి తర్వాత మధురపై బీజేపీ దృష్టి..
అయోధ్యలో రామమందిర నిర్మాణం, వారణాసిలో కాశీ విశ్వనాథ ధామ్ అభివృద్ధి తర్వాత బీజేపీ రాజకీయ చర్చల్లో మధురకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీకృష్ణ జన్మభూమి, షాహీ ఈద్గా మసీదు వివాదం చాలా కాలంగా న్యాయస్థానాలు, రాజకీయ వేదికలపై చర్చనీయాంశంగా మారింది. అయోధ్య, కాశీ, మధురలను బీజేపీ హిందుత్వ, సాంస్కృతిక రాజకీయాల పరంగా కీలక కేంద్రాలుగా పరిగణిస్తోంది. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ప్రాంతాల్లో మతపరమైన పర్యాటకం, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు శ్రీకృష్ణ జన్మభూమి అంశంపై కూడా బీజేపీ దృష్టి పెడుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
మధుర సమస్యకు పరిష్కార సూచనలు..
ఈ సమావేశంతో రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. సమావేశ ప్రధాన అజెండాలో ఈ అంశాన్ని చేర్చడం, మధుర శ్రీ కృష్ణ జన్మభూమి విషయంలో ఏదైనా కీలక పరిణామం చోటుచేసుకునే అవకాశం ఉందని పార్టీ అంతర్గత వర్గాలు భావిస్తున్నాయి. 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ తన హిందుత్వ అజెండా వ్యూహానికి మరింత పదును పెట్టేలా కనిపిస్తోంది. మరోవైపు, సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందుత్వ అంశాలపై ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. కులాల వారీగా చీలిపోయిన హిందూ ఓట్లను సంఘటిత చేయడానికి, 2027 ఎన్నికలకు ముందు హిందూ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేయడానికి బీజేపీ కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
UP Elections 2027: అయోధ్య, కాశీ తర్వాత మధురపై బీజేపీ గురి.. కృష్ణ జన్మభూమి అజెండాలోకి!
-
Sabarimala : తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం
-
Amitabh Bachchan: ‘‘బుల్లెట్ ప్రూఫ్ కూడా కాపాడదు’’.. అమితాబ్ బచ్చన్‌కు గ్యాంగ్‌స్టర్ బెదిరింపులు..
-
Israel Hezbollah: ఓవైపు కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్యలు.. హిజ్బుల్లాపై ఇజ్రాయిల్ మెరుపుదాడి!
-
Surya Kumar Yadav: టీమ్‌లోకి మళ్లీ సూర్యకుమార్ యాదవ్..? బ్యాటింగ్‌లో మరోసారి విధ్వంసం..
ట్రెండింగ్
-
Gully Cricket: సచిన్ టెండూల్కర్‌తో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం, కేట్..!
-
Mohit Ulva: ఒంటిచేత్తో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.. ఎవరీ మోహిత్ ఉల్వా.. జడేజా కోచ్ దగ్గరే శిక్షణ!
-
ICC Chairman-Jay Shah: రెండోసారి ఐసీసీ చైర్మన్‌గా జై షా.. ఈసారి కూడా ఏకగ్రీవమే!
-
Vaibhav Sooryavanshi: సచిన్ టెండూల్కర్ అవుతాడో లేక వినోద్ కాంబ్లీ అవుతాడో చెప్పడం కష్టం..!
-
India Schedule: రోహిత్, కోహ్లీ మళ్లీ ఆడేది అప్పుడే.. టీమిండియా నెక్స్ట్ షెడ్యూల్ ఇదిగో..!