బండి సంజయ్ యాత్రపై టీఆర్‌ఎస్ చేసిన దాడిని తెలంగాణ బిజిపి వ్యవహారాల ఇంచార్జి తరుణ్ చుగ్ ఖండించారు. ఎన్టీవీతో మాట్లాడారు. బెంగాల్ తరహా విధ్వంసాలకు టీఆర్‌ఎస్ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ గుండాలతో సంజయ్ యాత్రను ఆపాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎవరు ఎలాంటి కుట్రలు చేసినా ప్రజా సంగ్రామ యాత్ర ఆగదని స్పష్టం చేశారు. కేసీఆర్ అధికారం కోల్పోవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు తరుణ్ చుగ్. పోలీసుల తీరు సైతం సరిగ్గా లేదని విమర్శించారు. ముఖ్యమంత్రులు వస్తారు పోతారు.. పోలీసులు న్యాయం వైపు ఉండాలని తీవ్రంగా మండిపడ్డారు. బీజేపీలో చేరికలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల నుంచి చాలా మంది నాయకులు బీజేపీలో చేరుతున్నారని గుర్తు చేశారు. అమిత్ షా సభపై రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని తెలిపారు.
అయితే నిన్న జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో బీజేపీ నేతలపైకి టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్ల దాడి చేశారు. ఈనేపథ్యంలో..రెండు గంటలకు పైగా సాగిన ఈ ఆందోళనలో పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడగా.. ఒక వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు.
Bihar Cabinet Expansion: బిహార్ కేబినెట్ విస్తరణ.. మంత్రులుగా 31 మంది ప్రమాణస్వీకారం
