Site icon NTV Telugu

Chandigarh: ఆప్-కాంగ్రెస్ కూటమికి బిగ్ షాక్.. చండీగఢ్ మేయర్ బీజేపీ కైవసం

Chandigarh

Chandigarh

చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో ఆప్-కాంగ్రెస్ కూటమికి షాక్ తగిలింది. అనూహ్యంగా మేయర్ పదవిని బీజేపీ కైవసం చేసుకుంది. చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ కొత్త మేయర్‌గా బీజేపీకి చెందిన హర్‌ప్రీత్ కౌర్ బబ్లా గురువారం ఎన్నికయ్యారు. ఆప్‌కి చెందిన ప్రేమ్ లతపై విజయం సాధించారు. లతకు 17 ఓట్లు వస్తే.. బాబ్లాకు 19 ఓట్లు వచ్చాయి. ప్రిసైడింగ్ అధికారి రామ్‌నీక్ సింగ్ బేడీ అధికారికంగా ప్రకటించారు.

ఇది కూడా చదవండి: Sridhar Babu: గ్రామీణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమల్ని ఏర్పాటు చేయడమే లక్ష్యం!

చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్‌లోని అసెంబ్లీ హాలులో ఉదయం 11:20 గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 12:19 గంటలకు ముగిసింది. మేయర్ ఎన్నిక కోసం బీజేపీ, ఆప్-కాంగ్రెస్ కూటమి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అనంతరం ఫలితాలు తర్వాత ఆప్-కాంగ్రెస్ కూటమికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఓటింగ్‌కు ముందు 39 మంది సభ్యులు ఉన్న సభలో కూటమికి మొత్తం 19 మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఎక్స్‌-అఫిషియో సభ్యుడు, ఎంపీ మనీష్ తివారి మద్దతుతో బలం 20కి చేరుకుంది. మరోవైపు బీజేపీకి కేవలం 16 మంది కౌన్సిలర్లే ఉన్నారు. మెజార్టీ సాధించాలంటే 19 మంది ఉండాలి. అయితే ఫిరాయింపు కౌన్సిలర్లతో అనూహ్యంగా మేయర్ పీఠాన్ని బీజేపీ తన్నుకుపోయింది. ప్రతిపక్ష కూటమికి చెందిన ముగ్గురు కౌన్సిలర్లు బీజేపీకి అనుకూలంగా ఓటు వేయడంతో మేయర్ పదవిని సొంతం చేసుకుంది. పంజాబ్-హర్యానా హైకోర్టు మాజీ న్యాయమూర్తి(రిటైర్డ్) జై శ్రీ ఠాకూర్‌ను మేయర్ ఎన్నికకు స్వతంత్ర పరిశీలకురాలిగా సుప్రీంకోర్టు నియమించింది.

ఇది కూడా చదవండి: Forest and Revenue Officials Joint Committee: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలు..! అటవీ, రెవెన్యూ శాఖల విచారణ ప్రారంభం..

హర్‌ప్రీత్ కౌర్ బబ్లా..
హర్‌ప్రీత్ కౌర్ బబ్లా(60).. మాజీ కౌన్సిలర్ దేవిందర్ సింగ్ బబ్లా భార్య. అలాగే రిటైర్డ్ ఆర్మీ కల్నల్ కుమార్తె. హర్‌ప్రీత్ డెహ్రాడూన్‌లోని జీసస్ అండ్ మేరీ కాన్వెంట్‌లో పూర్వ విద్యార్థిగా ఉన్నారు. డిగ్రీలో బీఏ, ఆంగ్లంలో పీజీ చేశారు. చండీగఢ్ అభివృద్ధికి అంకితభావంతో పని చేస్తానని ఆమె పేర్కొన్నారు.

 

Exit mobile version