Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
- ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో మంత్రి పదవి ఆఫర్?
- మీడియాలో కథనాలు
- క్లారిటీ ఇచ్చిన బీజేపీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు రాజీనామా తర్వాత మరో కేంద్ర మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి. కొన్ని మీడియా ఛానల్స్‌లో వార్తలు హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను భారతీయ జనతా పార్టీ ఖండించింది. ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అవన్నీ పూర్తిగా కల్పిత కథనాలేనని స్పష్టం చేసింది.
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో కేబినెట్ పదవి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిందన్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఈ వార్తలకు ఎలాంటి ఆధారం లేదని.. అవి పూర్తిగా కల్పితం, నిరాధారమైన ప్రచారం అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ సిఫారసు మేరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను ఆమోదించారు. అనంతరం కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు.
Also Read
- PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
- BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
నీట్ ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ దగ్గర నెలకు పైగా ఆందోళనలు నిర్వహిస్తున్న సీజేపీ ప్రధాన డిమాండ్ కూడా ఆయన రాజీనామానే. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం, సీజేపీ మధ్య జరిగిన చర్చలు కూడా ఫలితం లేకుండా ముగిశాయి. రాజీనామా అనంతరం సోషల్ మీడియాలో స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్.. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యా సంస్కరణల కోసం నాలుగు దశాబ్దాలకుపైగా పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు విద్యాశాఖ మంత్రిగా పనిచేసే అవకాశం ఇచ్చిన ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘గత 10 రోజుల పరిణామాలు నన్ను తీవ్రంగా కలిచివేశాయి. ఇది నా వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన విషయం కాదు. భారత యువతే ఈ దేశానికి అసలైన శక్తి.’’ అని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతినకుండా ఉండేందుకు, దేశ వ్యతిరేక శక్తులు ఉద్యమాన్ని ఉపయోగించుకోకుండా ఉండేందుకే తాను రాజీనామా చేసినట్లు వివరించారు.
బీజేపీ ఖండన
కొన్ని మీడియా కథనాల్లో ధర్మేంద్ర ప్రధాన్‌కు మరో కీలక మంత్రిత్వ శాఖను ఆఫర్ చేసినప్పటికీ ఆయన తిరస్కరించారనే ప్రచారం జరిగింది. అయితే అలాంటి ప్రతిపాదన ఎప్పుడూ జరగలేదని బీజేపీ స్పష్టంగా తెలిపింది. కేబినెట్ నిర్ణయాలపై నిరాధార ఊహాగానాలు చేయవద్దని సూచించిన బీజేపీ.. విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ పరీక్షల విశ్వసనీయతను పెంచడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొంది.
ఇదే సమయంలో దేశంలోని ప్రభుత్వ పరీక్షల వ్యవస్థను పూర్తిగా సంస్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకణి నేతృత్వంలో ఉన్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పరీక్షల భద్రత, పారదర్శకత, సైబర్ సెక్యూరిటీ, అభ్యర్థుల గుర్తింపు ధృవీకరణ, డేటా రక్షణ, ప్రశ్నాపత్రాల లీకేజీలను ముందుగానే గుర్తించే సాంకేతిక వ్యవస్థలపై సూచనలు ఇవ్వనుంది. అలాగే పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) చట్టంలో సవరణలు తీసుకువచ్చి, ప్రశ్నాపత్రాల లీక్ ముఠాలపై మరింత కఠిన చర్యలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Mega Mass Moment: ఒకే ఫ్రేమ్‌లో చిరంజీవి, రామ్‌చరణ్, రవితేజ.. ‘ఇరుముడి’ టీమ్‌కు మెగా సర్ప్రైజ్ .. పిక్స్ వైరల్!
-
PM Kisan: పీఎం కిసాన్ 24 విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి..? కీలక అప్డేట్..
-
Harmanpreet Kaur: ఆమె డేంజరస్ ప్లేయర్.. త్వరగా ఔట్ చేయకుంటే ఓటమి ఖాయం.. హర్మన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
BRICS: మోడీ విందుకు జిన్‌పింగ్ డుమ్మా.. కారణం ఏంటంటే..?
-
8th Pay Commission: గుడ్ న్యూస్.. ఒక్క నిర్ణయంతో రూ.69 వేలకు చేరనున్న కనీస బేసిక్.. ఉద్యోగులు, పెన్షనర్లకు జాక్‌పాట్!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!