Falta Re-polling Result: అభిషేక్ బెనర్జీ అడ్డాలోనే టీఎంసీ ఖల్లాస్.. ఫల్తా రీపోలింగ్‌లో బీజేపీ క్లీన్ స్వీప్!
- లక్షకు పైగా మెజారిటీతో ‘పాండా’ సంచలన విజయం
- ఫోర్త్ ప్లేస్‌కు పడిపోయిన టీఎంసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Falta Re-polling Result: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఊహించని భారీ కుదుపు చోటుచేసుకుంది. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని ‘ఫల్తా’ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉత్కంఠభరిత రీపోలింగ్‌లో భారతీయ జనతా పార్టీ (BJP) అఖండ విజయాన్ని నమోదు చేసింది. ఈ రీపోలింగ్‌లో బీజేపీ అభ్యర్థి దేబాంగ్షు పాండా ఏకంగా 1,08,000 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచి సంచలనం సృష్టించారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీకి కోలుకోలేని షాక్ తగిలి ఏకంగా నాలుగో స్థానానికి పడిపోయింది.
డైమండ్ హార్బర్ కోటలో బీజేపీ జెండా!
ఈ విజయం సాధారణమైనది కాదు.. ఎందుకంటే ఫల్తా నియోజకవర్గం టీఎంసీ నెంబర్-2, ఎంపీ అభిషేక్ బెనర్జీకి చెందిన ‘డైమండ్ హార్బర్’ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ఒకప్పుడు తృణమూల్ కాంగ్రెస్‌కు తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ స్థానంలో కమలం వికసించడం.. బెంగాల్ రాజకీయాల్లో ఇక మమతా బెనర్జీ మార్క్ హవాకు బ్రేకులు పడ్డాయనే సంకేతాన్ని స్పష్టంగా ఇస్తోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
Also Read
- Bihar Liquor Smuggling: మద్యం మాఫియా కొత్త ఎత్తుగడ.. అందమైన మధ్యతరగతి అమ్మాయిలే టార్గెట్..
- Delhi: షాకింగ్.. సంతానలేమి పరీక్షలకు వెళ్తే పురుషుడి కడుపులో గర్భాశయం లభ్యం.. కట్‌చేస్తే..
- Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. ఇంట్లో సూసైడ్ నోట్ లభ్యం..
- Ujjain: 170 ఏళ్ల హనుమంతుడి విగ్రహం.. రెండు రోజులు ప్రయత్నించినా అంగుళం కూడా కదల్లేదు!
వివాదాల నుంచి రీపోలింగ్ వరకు.. అసలేం జరిగిందంటే
ఈ స్థానానికి తొలిసారిగా ఏప్రిల్ 29న పోలింగ్ జరిగింది. అయితే ఆ సమయంలో అధికార టీఎంసీ ఈవీఎంల తారుమారుకు పాల్పడిందని, బూత్ క్యాప్చరింగ్, ఓటర్లను బెదిరించడం వంటి అక్రమాలకు ఒడిగట్టిందని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ స్థానంలో నెలకొన్న తీవ్రతను గమనించిన ఎన్నికల సంఘం (EC) అక్కడ జరిగిన పోలింగ్‌ను రద్దు చేసి, మే 21న కట్టుదిట్టమైన కేంద్ర బలగాల నిఘాలో మొత్తం 285 బూత్‌లలో రీపోలింగ్ నిర్వహించింది. ఈసారి భయం లేకుండా దాదాపు 88 శాతం మంది ఓటర్లు తరలివచ్చి ప్రశాంతంగా ఓటు వేశారు. ఈరోజు (మే 24, ఆదివారం) జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచే బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. రౌండ్ రౌండ్‌కు మెజారిటీ పెరుగుతూ పోయింది..
దేబాంగ్షు పాండా (BJP): 1,49,666 ఓట్లు (విజేత)
శంభు నాథ్ కుర్మి (CPM): 40,645 ఓట్లు (రెండో స్థానం)
అబ్దుర్ రజాక్ మొల్లా (Congress): 10,084 ఓట్లు (మూడో స్థానం)
జహంగీర్ ఖాన్ (TMC): 7,783 ఓట్లు (నాలుగో స్థానం – డిపాజిట్ గల్లంతు)
ట్విస్ట్ ఏంటంటే.. ఈ రీపోలింగ్‌కు ముందే ఓటమిని పసిగట్టిన టీఎంసీ అభ్యర్థి జహంగీర్ ఖాన్ తాను పోటీలో నిలబడనని ముఖం చాటేయడం గమనార్హం. అయితే చివరకు ఆయనకు ఈ ఎన్నికల్లో దక్కింది కేవలం 7 వేల పైచిలుకు ఓట్లే. ఈ ఘోర పరాజయాన్ని జీర్ణించుకోలేకపోతున్న మాజీ సీఎం మమతా బెనర్జీ రిజల్ట్స్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. “బీజేపీ ఏజెంట్లలా నటిస్తూ కేంద్ర బలగాలు కౌంటింగ్ కేంద్రాల్లోకి దూరి ఓట్లను మళ్లీ దొంగిలించాయి” అంటూ ఆమె మండిపడ్డారు. మరోవైపు ఈ ఘనవిజయంపై పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి స్పందిస్తూ.. టీఎంసీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అభిషేక్ బెనర్జీ చెప్తుండే ‘డైమండ్ హార్బర్ మోడల్’ కాస్తా ఇప్పుడు ‘తృణమూల్ నష్ట నమూనా’గా మారిపోయిందని ఎద్దేవా చేశారు. తాను ప్రజలను లక్ష మెజారిటీ అడిగితే.. వారు 1.08 లక్షల మెజారిటీతో నమ్మకాన్ని నిలబెట్టారని, ఫల్తా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి మళ్లీ ‘స్వర్ణ వైభవాన్ని’ తీసుకొస్తామని ఆయన స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Prabhas Fauzi: ఫౌజీ విడుదలపై కొత్త డౌట్స్.. చైతు, దుల్కర్, విశ్వక్ సినిమాల రిలీజ్‌తో డార్లింగ్ ఫ్యాన్స్‌లో టెన్షన్!
-
Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
-
YS Jagan: గట్టిగా పోరాడదాం.. జరిగేది కురుక్షేత్ర సంగ్రామం.. స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ కీలక వ్యాఖ్యలు!
-
Padayatra 2.0: పాదయాత్ర 2.0పై వైఎస్ జగన్ క్లారిటీ!
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
ట్రెండింగ్
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!
-
2.5K డిస్ప్లే, 8200mAh బ్యాటరీతో Infinix Xpad 30 Pro టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే.?