NTV Telugu Site icon

Delhi Election Results: మోడీ.. ఓ అభ్యర్థి కాళ్లు మొక్కారు.. అతడి పరిస్థితి ఏంటంటే..!

Modi

Modi

దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని మొత్తానికి 27 ఏళ్ల తర్వాత కమలం పార్టీ కైవసం చేసుకుంది. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. బీజేపీ 47, ఆప్ 23 సీట్లు గెలుచుకున్నాయి. ఇక కేజ్రీవాల్ ఓటమి చెందడం ఆప్ పార్టీకి ఘోర పరాభవంగా చెప్పొచ్చు.

ఇదిలా ఉంటే ప్రధాని మోడీ ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టేజీపై ఉండగా ఒక బీజేపీ అభ్యర్థి వచ్చి కాళ్లు మొక్కుతారు. వెంటనే ప్రధాని మోడీ కూడా అభ్యర్థి కాళ్లు మొక్కారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. మరోసారి ఆయన పేరు సోషల్ మీడియాలో చర్చకు వచ్చింది. ఆ అభ్యర్థి గెలిచాడా? ఓడిపోయాడా? అని చర్చిస్తున్నారు.

రవీంద్ర సింగ్ నేగి.. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పట్పర్‌గంజ్ స్థానం నుంచి పోటీ చేశారు. ఇతడి కాళ్లకు మోడీ మొక్కారు. ఇక తాజా ఫలితాల్లో రవీంద్ర సింగ్ నేగి ఘన విజయం సాధించారు. ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి అవధ్ ఓజాను 23 వేల 280 ఓట్ల తేడాతో ఓడించారు. 2013 నుంచి పట్పర్‌గంజ్ స్థానాన్ని ఆప్ కంచుకోటగా చేసుకుంది. ఇక 2020 అసెంబ్లీ ఎన్నికల్లో మనీష్ సిసోడియా ఇక్కడ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు రవీంద్ర సింగ్ నేగి.. కేవలం 2 శాతం ఓట్లతో సిసోడియాపై ఓడిపోయారు. తాజా ఫలితాల్లో మాత్రం రవీంద్ర సింగ్ నేగి.. ఆప్ కంచుకోటను బద్ధలు కొట్టారు. భారీ విజయంతో గెలుపొంది హిస్టరీ సృష్టించారు.