Rahul Gandhi: కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే, ప్రస్తుతం ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. విదేశాలకు వెళ్లి భారత్ పరువు తీసేలా మాట్లాడుతున్నాడని బీజేపీ మండిపడుతోంది. ఒక బాధ్యతయుతమైన పదవిలో ఉండీ, భారత అంతర్గత విషయాలపై విమర్శలు చేయడమేంటని ప్రశ్నిస్తోంది. ఇదిలా ఉంటే, తాజాగా రాహుల్ గాంధీ అమెరికా శాసనసభ్యురాలు ఇల్హాన్ ఒమర్‌తో భేటీ అయ్యారు.
సాధారణంగా అమెరికాలో లామేకర్‌తో భేటీ అయినా కూడా పెద్దగా సమస్య ఉండకపోయేది, కానీ ఇల్హాన్ ఒమర్‌ని కలవడంపై దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్‌కి బద్ధ వ్యతిరేకి, పాకిస్తాన్‌కి వంతపాడేదిగా పేరున్న ఒమర్‌తో రాహుల్ గాంధీ భేటీ కావడం వివాదాస్పదమైంది. ఈమె ఒకసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లో పర్యటించింది. ఆమె పర్యటనను దగ్గరుండీ పాకిస్తాన్ స్పాన్సర్ చేసింది. ఇండియాకు వ్యతిరేకంగా, పాక్‌కి అనుకూటంగా అమెరికా చట్ట సభల్లో పలు తీర్మానాలను కూడా ప్రవేశపెట్టింది. ప్రధాని నరేంద్రమోడీ అమెరికా చట్టసభల్ని ఉద్దేశించి మాట్లాడటాన్ని కూడా వ్యతిరేకించింది. డోనాల్ ట్రంప్ ఒమర్‌ని తీరును పలు సందర్భాల్లో అసహ్యించుకున్నాడు.
Read Also: Earthquake: భారత్, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లలో భూకంప ప్రకంపనలు..
ఇలాంటి వ్యక్తిలో రాహుల్ గాంధీ భేటీ కావడాన్ని బీజేపీ విమర్శిస్తోంది. ‘‘భారత ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ USAలో పాకిస్తాన్ ప్రాయోజిత భారత వ్యతిరేక గొంతు, రాడికల్ ఇస్లామిస్ట్, స్వతంత్ర కాశ్మీర్ యొక్క న్యాయవాది అయిన ఇల్హాన్ ఒమర్‌ను కలిశారు. పాకిస్తానీ నాయకులు కూడా ఇలాంటి ఆవేశపూరిత అంశాలతో కనిపించడం పట్ల మరింత నిశితంగా ఉంటారు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు భారత్‌కు వ్యతిరేకంగా బహిరంగంగా పనిచేస్తోంది’’ అని బీజేపీ ఐటీ హెచ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్టులో ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరో బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా కూడా రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ‘‘”సిక్కులపై విషం చిమ్మిన తర్వాత మరియు విదేశీ గడ్డపై భారతదేశాన్ని చంపిన తర్వాత, ఇప్పుడు రాహుల్ గాంధీ భారత వ్యతిరేక ఇల్హాన్ ఒమర్‌తో సమావేశమయ్యారు మరియు నిమగ్నమయ్యారు – 1) ఇల్హాన్ US కాంగ్రెస్‌లో భారత వ్యతిరేక తీర్మానాలను ప్రవేశపెట్టారు 2) ఆమె ఆర్ట్ 370 3 రద్దుకు వ్యతిరేకంగా ఉంది. ) ఆమె భారతదేశ సార్వభౌమాధికారాన్ని ఉల్లంఘించింది, పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన పర్యటనలో పీఓకేని సందర్శించింది 4) భారతదేశంలో “ఇస్లామోఫోబియా” గురించి చర్చించడానికి ఆమె ఇమ్రాన్ ఖాన్‌ని కలిశారు 5) హిందువులపై ద్వేషం పెంచడంలో ఆమె కీలక పాత్ర పోషించింది, రాహుల్ గాంధీ ఆమెను ఎందుకు కలవాల్సి వచ్చింది ప్రతి విదేశీ పర్యటనలో ఆయన అత్యంత తీవ్రమైన భారత వ్యతిరేక అంశాలతో ఎందుకు నిమగ్నమై ఉన్నారు – దేశ్ వ్యతిరేక్ ఓకే?’’ అని ఆయన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.