NTV Telugu Site icon

Mamata Banerjee: బీజేపీ అధికారంలో ఉండేది మరో 6 నెలలే.. ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు..

Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఎన్నికలు జరుగుతాయని.. బీజేపీ ప్రభుత్వం మరో 6 నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. జూలై 8న పశ్చిమ బెంగాల్ లో జరగే పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. జల్‌పైగురి జిల్లాలో జరిగిన ర్యాలీని ఉద్దేశించి బెనర్జీ మాట్లాడుతూ.. రేపు బీజేపీ అధికారంలో ఉండకపోవచ్చని.. కాబట్టి బీఎస్ఎఫ్ బలాలు నిష్ఫక్షపాతంగా పనిచేయాలని ఆమె అన్నారు. ఇప్పటికే బీజేపీ ఓటమిని పసిగట్టి వివిధ గ్రాపులు, వర్గాలతో లాబీయింగ్ చేయడానికి ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు.

మైనారిటీలను, దళితులను కొట్టిన ఆరోపణలు ఎదుర్కొంటున్నవారే ప్రస్తుతం వారితేనే ఫోటోలు దిగుతున్నారని విమర్శించారు. ముస్లిం కమ్యూనిటీ సభ్యులతో ఎంతో శ్రద్ధ చూపుతున్నామని చెప్పడానికి వారితో ఫోటోలు దిగుతున్నారని.. ఎక్కువ మంది వ్యాపారులు, పేదలు, అణగారిన వర్గాలను గురించి పట్టించుకోని ముస్లింలను బీజేపీ ఉపయోగించుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీదీ ఇక్కడ ఉన్నంత వరకు మైనారిటీలు ఇక్కడ సురక్షితంగా ఉంటారని ఆమె అన్నారు.

Read Also: Eid al-Adha 2023: భారత్‌లోని ప్రసిద్ధ మసీదుల గురించి మీకు తెలుసా?

ఇటీవల బీఎస్ఎఫ్ కాల్పుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారం ప్రకటించారు. వారి కుటుంబాల్లో ఒకరికి హోంగార్డుగా ఉద్యోగం ఇస్తున్నట్లు మమతా బెనర్జీ ప్రకటించారు. బీఎస్ఎప్ అధికారులు అందరిపై నేను ఆరోపణలు చేయడం లేదని..వారు మన దేశ సరిహద్దుల్ని కాపాడుతున్నారని.. అయితే రేపు బీజేపీ అధికారంలో ఉండకపోవచ్చని.. బీఎస్ఎఫ్ తమ పనిచేస్తూనే ఉండాలని.. వారు నిష్ఫాక్షికంగా స్వతంత్రంగా వ్యవహరించాలని ఆమె అన్నారు. గతేడాది సరిహద్దుల్లో స్మగ్లర్లుగా పేర్కొంటూ బీఎస్ఎప్ గ్రామస్తులను కాల్చి చంపిన విషయాన్ని మమత ప్రస్తావించారు. బీజేపీ తరుపున బీఎస్ఎఫ్ సరిహద్దుల్లోని ఓటర్లను బెదిరిస్తోందని ఆమె ఆరోపించారు.

కేంద్రంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష కూటమి ఏర్పాటు చేసేందుకు సీపీఎం, కాంగ్రెస్ పాత్ర ఉందని అన్నారు. మేము పాన్ ఇండియా స్థాయిలో పొత్తు పెట్టుకోవచ్చు.. కానీ బెంగాల్ లో బీజేపీ-సీపీఎం-కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని, రాష్ట్రంలో వారు ఓడిపోతారని ఆమె అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీఎంసీని గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. గ్రామస్థాయిలో అవినీతిని సున్నాకు చేరుస్తామని ఆమె ప్రకటించారు. ఎవరైనా డబ్బులు అడిగితే నేనుగా నాకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. జూలై 8న బెంగాల్ లోని జిల్లా పరిషత్, పంచాయతీ సమితి, గ్రామపంచాతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 75,000 మంది అభ్యర్థులు ఎన్నికల్లో నిలబడ్డారు. 5.67 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

Show comments