NTV Telugu Site icon

BJP- AAP Poster War: ఢిల్లీలో హీటెక్కిన పాలిటిక్స్.. బీజేపీ- ఆమ్ ఆమ్‌ ఆద్మీ పార్టీల మధ్య పోస్టర్ ఫైట్

Bjp Vs Aap

Bjp Vs Aap

BJP- AAP Poster War: దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆమ్‌ ఆద్మీ పార్టీ, బీజేపీ వినూత్న ప్రచారానికి తెర లేపాయి. ఒకరి లోపాలను మరొకరు ఎత్తి చూపుతూ, హామీల వర్షం కురిపిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో బీజేపీ రిలీజ్ చేసిన పోస్టర్‌కు ఆప్‌ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చిపడేసింది. ఇక, ఆప్‌ జాతీయ కన్వీనర్‌, మాజీ సీఎం కేజ్రీవాల్‌ ఒకే అడ్రస్‌లో వందల సంఖ్యలో బోగస్‌ ఓట్లు చేర్చారని బీజేపీ ఎక్స్‌ (ట్విట్టర్) వేదికగా విమర్శించింది. ఇంటి యజమానికి తెలియకుండా నకిలీ ఓట్లను రిజిస్టర్ చేస్తున్నారని ఆరోపించింది. ఇది కేజ్రీవాల్ కొత్త గేమ్ అంటూ తీవ్రంగా మండిపడింది. ఆప్‌కు నకిలీ ఓటర్లపై ప్రేమ అనే మీనింగ్ వచ్చేలా ఒక పోస్టర్‌ను నెట్టింట షేర్ చేసింది. దీంతో ఆమ్ ఆద్మీ పార్టీ కౌంటర్ ఎటాక్ కు దిగింది. ఆ విమర్శను తిప్పి కొడుతూ ‘గోట్‌’ (గ్రేటెస్ట్ ఆఫ్‌ ఆల్‌టైమ్‌) అంటూ కేజ్రీవాల్ ఉన్న మరో పోస్టర్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

Read Also: Akash Deep: సిడ్నీ టెస్టు నుండి టీమిండియా ఫాస్ట్ బౌలర్ అవుట్..

ఇక, ఇదిలాఉంటే.. ఢిల్లీలో ఓటర్లకు బీజేపీ నగదు పంపిణీ చేస్తుందని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఆరోపిస్తుంది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడు మోహన్‌ భగవత్‌కు అరవింద్ కేజ్రీవాల్ లేఖ రాశారు. కమలం పార్టీ చేస్తున్న తప్పులను ఆర్ఎస్ఎస్ ఆమోదిస్తుందా? అని అందులో క్వశ్చన్ చేశారు. ఈ లేఖపై బీజేపీ రియాక్ట్ అవుతూ.. ఇలా మీడియా దృష్టిని ఆకర్షించాడానికి ఆర్ఎస్ఎస్ అధ్యక్షుడికి లేఖ రాయడానికి బదులు ఆ సంస్థ నుంచి సేవా స్ఫూర్తిని నేర్చుకోవాలని కేజ్రీవాల్‌కు సూచించారు.

Read Also: Mythri Movie Makers : పుష్పా-2 నిర్మాతలకు హై కోర్టులో ఊరట

అయితే, దేశ రాజకీయాల్లోనే ఆమ్ ఆద్మీ పార్టీ అవిశ్వసనీయ పార్టీకి ఉదాహరణ అని.. దీనిని ప్రజలు అర్థం చేసుకున్నారని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది విమర్శలు గుప్పించారు. అబద్ధాలు చెప్పడం మానుకోవడానికి కొత్త సంవత్సరం రోజున కేజ్రీవాల్‌ తీర్మానించుకోవాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ ఆప్ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు మరో లేఖ రాశారు. దీంతో ఇరు పార్టీల మధ్య సోషల్ మీడియా వేదికగా ఫైట్ కొనసాగుతుంది.

Show comments