Bihar Elections: ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. సా.4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్
- ఈరోజే బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
- సా.4 గంటలకు ఈసీ ప్రెస్‌మీట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్‌లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది. తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని పార్టీలు కోరాయి. ఈ నేపథ్యంలో రెండు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియ ముగించేందుకు కసరత్తు చేసినట్లు సమాచారం. సాయంత్రం 4 గంటలకు బీహార్ ఎన్నికల షెడ్యూల్‌తో పాటు దేశంలో అనేక ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయనుంది. తెలంగాణలోని జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు కూడా షెడ్యూల్ విడుదల చేయనుంది.
ఇది కూడా చదవండి: Manipur: మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు.. బీజేపీ నేతలు సమాలోచనలు
Also Read
- Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
- Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
- SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
- EPFO Claim Rejection: మీ PF క్లెయిమ్ రిజెక్ట్ అవుతోందా..? ముందుగా ఈ విషయాలు చెక్ చేయండి
బీహార్‌లో దీపావళి తర్వాత అత్యంత గ్రాండ్‌గా నిర్వహించే పండుగ ఛత్ పండుగ. ఈ పండుగ అక్టోబర్ 25-28 తేదీల్లో జరుగుతుంది. ఈ పండుగ కోసం రాష్ట్రం వెలుపల ఉన్న బీహారీయులంతా వచ్చేస్తారు. ఈ నేపథ్యంలో బీహారీయులు తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్లకముందే ఎన్నికలు నిర్వహించాలని అన్ని పార్టీలు ఈసీని కోరాయి. అంతేకాకుండా గతంలో మాదిరిగా మూడు విడతల్లో కాకుండా తక్కువ సమయంలో ఎన్నికలు ముగించాలని.. ప్రచార భారం లేకుండా చేయాలని విజ్ఞప్తి చేశాయి. పార్టీల అభ్యర్థన మేరకు రెండు విడతల్లో ఎన్నికల ప్రక్రియను ముగించాలని ఈసీ భావిస్తోంది. నవంబర్ మొదటి, రెండు వారాల్లో ఎన్నికలు ముగించవచ్చని సమాచారం.
పలు రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని జూబ్లీ హిల్స్, ఒడిస్సా లోని నౌపాడా, పంజాబ్‌లోని తరణ్ తరణ్, రాజస్థాన్‌లోని అంతా, జార్ఖండ్‌లోని ఘట్ సిలా,
మిజోరాంలోని డంపా, జమ్మూ కాశ్మీర్‌లోని రెండు అసెంబ్లీ స్థానాలు బడ్ గామ్, నగ్రోతాకు బైపోల్ షెడ్యూల్ విడుదల కానుంది.
ఇది కూడా చదవండి: Delhi Metro: ఢిల్లీ మెట్రోలో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్.. వీడియో వైరల్
ఇక ఈసారి ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫొటోలు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈసీ తెలిపింది. అలాగే బూత్‌ల్లో 1,200 మంది కంటే ఎక్కువ ఓటర్లు ఉండరని చెప్పింది. విజయవంతంగా అన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ సర్వే పూర్తైందని పేర్కొంది. ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ పదవీ కాలం నవంబర్ 22తో ముగుస్తుంది. ఆలోపు కంటే ముందే ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!