బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో దారుణం జరిగింది. తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి గొంతు కోసి నిందితుడు పరారయ్యాడు. దీంతో బిడ్డ జాడ వెతుక్కుంటూ వెళ్లిన తల్లికి రక్తపుమడుగులో ఉన్న కుమార్తెను చూసి వెంటనే ఆస్పత్రికి తరలించింది. కానీ ఆస్పత్రి వైద్యులు బాలికను పట్టించుకోలేదు. దాదాపు 6 గంటలు నిరీక్షించినా బెడ్ కేటాయించలేదు. దీంతో బాలిక ప్రాణాలు వదిలింది. అయితే వైద్యుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
ఇది కూడా చదవండి: Russia Ukraine War: ట్రక్కుల్లో 117 డ్రోన్లు,18 నెలల ప్లానింగ్.. రష్యాను దారుణంగా దెబ్బతీసిన ఉక్రెయిన్..
రోహిత్ సాహ్ని అనే నిందితుడు చేపలు అమ్ముతుంటాడు. తొమ్మిదేళ్ల దళిత బాలిక కనిపించగానే చిరుతిళ్లు ఇస్తానని ప్రలోభపెట్టి బయటకు తీసుకెళ్లాడు. అనంతరం నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం ఆమె గొంతు కోసి పారిపోయాడు. ఇంట్లో నిద్రపోతున్న తల్లి.. కుమార్తె కోసం వెతకగా సాహ్నితో కనిపించిందని స్థానికులు చెప్పారు. అతడ్ని నిలదీయగా తనకు తెలియదన్నాడు. దీంతో ఆమె వెతుక్కుంటూ వెళ్లగా నిర్జన ప్రదేశంలో చిన్నారి తీవ్రగాయాలతో రక్తపుమడుగులో అర్ధనగ్న స్థితిలో కనిపించింది. వెంటనే తల్లి ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ మరియు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం పాట్నాలోని మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కు తరలించారు. దాదాపు 6 గంటల పాటు నిరీక్షించిన వైద్యులు పట్టించుకోలేదు. దీంతో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బిడ్డ ప్రాణాలు పోయాయని రోధించింది. ఆరు గంటల పాటు డాక్టర్లు పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఇది కూడా చదవండి: Aamir Khan : మొత్తానికి గౌరీ గురించి మనసులో మాట బయటపెట్టిన అమీర్ ఖాన్.. !
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే బాలిక చనిపోయిందని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది చాలా క్రూరత్వమని.. చాలా సిగ్గుచేటు అని.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ధ్వజమెత్తారు. సకాలంలో చికిత్స అందించుంటే బాలిక ప్రాణాలు నిలిచేవని.. కానీ డబుల్ ఇంజిన్ సర్కార్ నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు పోయాయని తెలిపారు. అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
బీహార్‌లో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో బాలిక మరణం చెందడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని ఆర్జేడీ ఆరోపించింది. ఆరోగ్య సదుపాయాలు కూడా లేకపోవడంతోనే బాలిక చనిపోవల్సి వచ్చిందని ఆర్జేడీ ధ్వజమెత్తింది.