Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. శనివారం రాజస్థాన్ జైపూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆమె బీజేపీపై ఆరోపణలు గుప్పించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి ఏర్పడిన కేంద్ర సంస్థల్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిరుద్యోగాన్ని గరిష్టస్థాయికి చేర్చిందని విమర్శించారు.
Read Also: PM Modi: యుపి ర్యాలీలో “ఫ్లాప్ ఫిల్మ్” అంటూ వారి పై వ్యాఖ్యలు చేసిన పీఎం మోడీ..!
జైపూర్‌లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియాగాంధీ సమక్షంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన అనంతరం ఆమె జైపూర్‌లో జరిగిన బహిరంగ ర్యాలీలో మాట్లాడారు. ప్రజల ఆశల్ని వమ్ము చేసేందుకు బీజేపీ అగ్నివీర్ పథకాన్ని తీసుకువచ్చిందని, ప్రతీ రాష్ట్రంలో పేపర్ లీక్స్ అవుతున్నాయని, రైతులు వీధుల్లోకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ప్రధాని మోడీకి వినడానికి సిద్ధంగా లేరని ప్రియాంకాగాంధీ ఆరోపించారు. మీరు వేయబోయే ఓట్లు దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాయని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫఏస్టో దేశ ప్రజల గొంతుకగా ఆమె అభివర్ణించారు.
రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి ఎన్నిక కావడం సంతోషంగా, గర్వంగా ఉందని ఆమె అన్నారు. ‘న్యాయపాత్ర’ పేరుతో నిన్న కాంగ్రెస్ మేనిఫేస్టో విడుదల చేశామని ఆమె చెప్పారు. ఈ ఎన్నికలు రెండు సిద్ధాంతాలకు మధ్య జరుగుతున్నాయని, ఒక వైపు దేశాన్ని, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే శక్తులు ఉంటే, మరోవైపు దేశాన్ని రక్షించే ఇండియా కూటమి ఉందని సచిన్ పైలెట్ వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు దేశంలో 7 విడతల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. జూన్ 4న ఫలితాలు వెలువడుతాయి.
